చంద్రబాబు బినామీలతో విజయసాయి రెడ్డికి పనేంటో?

Vijaya Sai Reddy - Sujana Chowdary-CM Rameshఇటీవల బీజేపీలో చేరిన నలుగురు రాజ్యసభ సభ్యుల్లో ముగ్గురు ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు బినామీలేనని వైఎస్సార్‌ సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి ఆరోపించారు. తనపై అవినీతి కేసులు పెట్టకుండా రక్షణ కోసమే వారిని పంపించారన్నారు. శనివారం ట్విటర్‌ వేదికగా ఆయన చంద్రబాబుపై ధ్వజమెత్తారు. విజయసాయి రెడ్డి చెప్పింది నిజమే కావొచ్చు కానీ చంద్రబాబు బినామీలతో లోక్ సభలో ఆయన ఎందుకు చర్చలు జరిపినట్టు? అలాగే అందులో ఇద్దరితో కలిసి విజయసాయి రెడ్డి విందు ఆరగిస్తున్న ఫోటోలు కూడా ఉన్నాయి.

ADVERTISEMENT

మరి అటువంటి వారతో విజయసాయి రెడ్డికి స్నేహమెందుకు? అలాగే ప్రధాని విజయసాయి రెడ్డిని విజయ గారు అని సంబోధించే అంతటి చనువు ఉంది ఈ విషయం ఆయనకు చెప్పి వారిని పార్టీలోకి తీసుకోకుండా చెయ్యవలసిందని టీడీపీ అభిమానులు అంటున్నారు. చంద్రబాబుకు తెలయకుండానే ఫిరాయిస్తే వారిని అనర్హులుగా ప్రకటించాల్సిందిగా రాజ్యసభ చైర్మన్‌కు లేఖ రాసేవారని, ఇది 100 శాతం మ్యాచ్‌ ఫిక్సింగేనని విజయసాయి రెడ్డి సందేహం వ్యక్తం చేశారు.

బహుశా టీడీపీకి చెందిన ఇద్దరు రాజ్యసభ సభ్యులు, ముగ్గురు లోక్ సభ సభ్యులు రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్య నాయుడుని కలిసి వారిని అనర్హులుగా ప్రకటించాల్సిందిగా లేఖ ఇచ్చిన సంగతి విజయసాయి రెడ్డికి తెలిసి ఉండకపోవచ్చు అని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. చంద్రబాబు విహార యాత్రకు ఏ దేశం వెళ్లారో ఆ పార్టీ నాయకులకూ తెలియదా? స్విట్జర్లాండ్ వెళ్లారో స్వీడన్‌లో ఉన్నారో చెప్పలేనంత రహస్యమా? అని ప్రశ్నించారు. ఎల్లో మీడియా కూడా యూరప్ నుంచి ముఖ్య నాయకులతో ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పారని రాసిందన్నారు. కానీ యూరప్ అనేది దేశం కాదని, 44 దేశాలున్న ఖండమని అందరికీ తెలుసని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. విజయసాయి రెడ్డికి చంద్రబాబు హాలిడే గురించి అంత ఆసక్తి ఉంటే అధికారంలో ఉన్న వారికి అది తెలుసుకోకపోవడం అంత కష్టం కాదు కదా?

ADVERTISEMENT
Latest Stories