
వైసీపీలో విజయసాయి రెడ్డి (నంబర్: 2) సీటు ఖాళీ కాగానే దానిలో మళ్ళీ సజ్జల రామకృష్ణా రెడ్డినే జగన్ కూర్చోబెట్టారు. అది ఆయన పార్టీ కనుక ఆయన ఇష్టం. కానీ రాజ్యసభలో విజయసాయి రెడ్డి ఖాళీ చేసిన సీటులో జగన్ సొంత పార్టీ నేతలలో ఎవరినీ కూర్చోబెట్టలేరు. కనుక ఆ సీటు కూటమికి దక్కబోతోంది.
అయితే ఆ సీటు ఎవరికి కేటాయించాలో ముందుగా అనుకున్న తర్వాతే ఆయన రాజీనామా చేసి ఉండొచ్చు. రాజ్యసభ సీటు టీడీపీ, జనసేనల కంటే బీజేపికి చాలా అవసరం. కనుక ఏపీ బీజేపి నేతల్లో ఎవరో ఒకరికి ముందే ఖరారు చేసి ఉండొచ్చు. ఇది అప్రస్తుతం.
Also Read – కేసీఆర్ వైఖరిలో అనూహ్య మార్పులు.. ఏమవుతుందో?
కానీ రాజ్యసభ సీటు ఖాళీ అయ్యింది కనుక కేంద్ర ఎన్నికల కమీషన్ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 22 నుంచి 29 వరకు: నామినేషన్స్ స్వీకరణ. ఏప్రిల్ 30న వాటిని పరిశీలించి మే 9న పోలింగ్ నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్లు లెక్కించి వెంటనే ఫలితం ప్రకటిస్తుంది.
వైసీపీకి కేవలం 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నందున ఈ ఉప ఎన్నికలో పోటీ చేయలేదు. కనుక కూటమి తరపున అభ్యర్ధి పేరు ఖరారు చేస్తే చాలు రాజ్యసభ్యుడు అయిపోయిన్నట్లే. ఇంతకీ విజయసాయి రెడ్డి ఎవరికీ మహోపకారం చేశారో? దాని వలన ఆయనకు ఏమేమి ఉపశమనాలు లభించబోతున్నాయో? రాబోయే రోజుల్లో మెల్లగా తెలుస్తుంది.