రాజధాని ఎక్కడంటే అంబేడ్కర్ విగ్రహం అంటున్నారేమిటి?

Vijayawada-Ambedkar-Statue-Pointing-Finger-Towards-Capital-Amaravati

“ఏపీ సిఎం జగన్మోహన్‌ రెడ్డిగారు డిసెంబర్‌ 7-8 తేదీలలో కుటుంబ సమేతంగా విశాఖకు తరలివచ్చేస్తారు. ఋషికొండపై నిర్మించిన భవనాలలో నివసిస్తూ ఇకపై అక్కడి నుంచే రాష్ట్రాన్ని పాలిస్తారు. మధురవాడ సమీపంలో నిర్మించిన మిలీనియం టవర్స్‌లో ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటుకి సన్నాహాలు జరుగుతున్నాయి. పలువురు మంత్రులు విశాఖలో తమకు కేటాయించిన భవనాలలో క్యాంప్ ఆఫీసులు ఏర్పాటు చేసుకొంటున్నారు. ముఖ్యమంత్రి విశాఖకు వస్తున్నప్పుడు ఆయనకు ఎదురేగి ఘన స్వాగతం చెప్పేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు సన్నాహాలు చేసుకొంటున్నారు.” ఈ స్టోరీ అందరూ వినేశారు.

దాని తర్వాత స్టోరీ: “సిఎం జగన్‌ ఉత్తరాంధ్రా జిల్లాల అభివృద్ధి పనులను పర్యవేక్షించడానికి విశాఖకు వచ్చినప్పుడు ఆయన బస చేసేందుకు ఋషికొండపై పర్యాటక శాఖ భవనాలను సరిపోతాయని మంత్రుల కమిటీ సిఫార్సు చేసింది.” ఈ స్టోరీ కూడా అందరూ వినేశారు.

ADVERTISEMENT

మూడో స్టోరీ అంటే ‘విశాఖ రాజధాని అలియాస్ ముఖ్యమంత్రి మకాం’ ఇంకా చెప్పలేదు. అందరూ దాని కోసం ఎదురుచూస్తుంటే ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీ శ్రీలక్ష్మి వేరే కొత్త స్టోరీ చెపుతున్నారు.

విజయవాడ నగరంలో 18 ఎకరాల విస్తీర్ణంలో 125 అడుగుల ఎత్తైన డా.అంబేడ్కర్ విగ్రహం, దాని చుట్టూ స్మృతివనం పనులు దాదాపు పూర్తయ్యాయని చెప్పారు. సామాజిక న్యాయం కోసం పోరాడిన డా.అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషం కలిగిస్తోందన్నారు. జనవరి 20వ తేదీన విగ్రహావిష్కరణ జరుగుతుందని చెప్పారు.

సిఎం జగన్‌ అమరావతిని వద్దనుకొన్నప్పటికీ గత నాలుగున్నరేళ్ళుగా అక్కడే చంద్రబాబు నాయుడు కట్టిన భవనాలలోనే ఉంటూ రాష్ట్రాన్ని పాలిస్తున్నారు. అది వేరే సంగతి.

అయితే విశాఖను రాజధాని చేసుకొని రాష్ట్రాన్ని ఏలాలని ఫిక్స్ అయినప్పుడు, అమరావతికి కూతవేటు దూరంలో విజయవాడలో వందల కోట్లు ఖర్చు చేసి ఈ విగ్రహం, స్మృతివనం ఏర్పాటు ఎందుకు చేసిన్నట్లు?అదేదో ఋషికొండ ప్యాలస్‌లో నుంచి కనబడేలా విశాఖలో బీచ్ ఒడ్డున ఏర్పాటు చేసుకోవచ్చు కదా?కేసీఆర్‌ కూడా హైదరాబాద్‌లో అలాగే ఏర్పాటు చేసుకొన్నారు కదా?

అయినా విశాఖకు సార్ వస్తేనే ఉత్తరాంధ్రా జిల్లాలన్నీ అభివృద్ధి చెందుతాయని లేకుంటే లేదని తేల్చి చెప్పేసిన మంత్రి ధర్మానకు కూడా ఈ కొత్త స్టోరీ వింటే ‘సార్ అమరావతిలోనే సెటిల్ అయిపోతారేమో?” అని డౌట్ వచ్చిందో లేదో తెలీదు కానీ విశాఖ ప్రజలు సారొస్తారొస్తారని ఎదురుచూస్తూనే ఉన్నారు పాపం

ADVERTISEMENT
Latest Stories