అనాధల మారిన విజయవాడ వెస్ట్ జోన్…

Vijayawada West Zone Politics

రాజకీయాలకు అత్యంత కేంద్ర భిందువైన విజయవాడ నగరంలో ఎమ్మెల్యే సీటు అంటే అంత మాములు విషయం కాదు. ఆ సీటు కోసం అధిష్టానంతో రాజీలేని పోరాటం చెయ్యడానికి ఏ పార్టీ రాజకీయ నాయకుడైన ముందుంటాడు.

అయితే 2024 ఎన్నికలలో పొత్తు కారణంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సీటును ఆశించిన మాజీ జనసేన నేత పోతిన మహేష్ పొత్తులో భాగంగా ఆ సీటును దక్కించుకోలేకపోయారు. అయితే తనకు ఆశించిన సీటు దక్కలేదనే కోపంతో జనసేనను వీడి వైసీపీ ఫ్యాన్ కిందకు చేరిన పోతిన మహేష్ నాడు ఇక్కడి ప్రజల కోసమే నా ఈ తిరుగుబాటు అంటూ పవన్ పై రెచ్చిపోయారు.

ADVERTISEMENT

పార్టీ మారిన మహేష్ కు ఆశించిన సీటు మాత్రం దక్కలేదు. అయితే వైసీపీ నుంచి తనకు సీటు దక్కకపోయినప్పటికీ ఈ నియోజకవర్గ అభివృద్ధికి వైసీపీ గెలుపు తప్పనిసరి అంటూ పోతిన వైసీపీ తరుపున గట్టిగా ప్రచారం చేసారు. అయితే ఎన్నికల సమయంలో తెగ హడావుడి చేసిన ఈ మహేష్ ఇక ఆ తరువాత ఈ నియోజకవర్గ ప్రజల తరుపున మాట్లాడింది లేదు, ప్రభుత్వాన్ని నిలదీసింది లేదు.

ఇక కూటమి పొత్తులో భాగంగా టీడీపీ పార్టీ నుంచి సీటును ఆశించి అధిష్టాన నిర్ణయంతో సీటును త్యాగం చేసిన జలీల్ ఖాన్ కూడా ప్రస్తుతం పశ్చిమ నియోజకవర్గంలో రాజకీయంగా అంత యాక్టీవ్ గా లేరనే చెప్పాలి. ఇక ఇదే నియోజకవర్గం నుండి కూటమికి ప్రత్యర్థి గా ఎన్నికల బరిలో నిలిచి ఓడిన వైసీపీ అభ్యర్థి షేక్ ఆసిఫ్ జాడే కనుమరుగయ్యింది.

ఇక టీడీపీ, జనసేన రెండు పార్టీ నేతల త్యాగాల ఫలితంగా ఇంత కీలకమైన సీటును దక్కించుకున్న బీజేపీ నేత సుజనా చౌదరి పొత్తులో భాగంగా వైసీపీ అభ్యర్థి షేక్ ఆసిఫ్ పై సుమారు 47 వేల ఓట్ల మెజారిటీ తో విజయం సాధించారు.

అధికార పార్టీ ఎమ్మెల్యే గా ఉంటున్న సుజనా చౌదరి సైతం తన నియోజకవర్గంలో ప్రజలకు ఏ మాత్రం అందుబాటులో ఉండడం లేదనే ఆరోపణ స్థానిక ప్రజల నుంచి గట్టిగా వినిపిస్తుంది.

ఇలా ఈ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి సీటును ఆశపడినోడు పోతిన మహేష్, సీటును త్యాగం చేసినోడు జలీల్ ఖాన్, సీటును ఓడినోడు ఆసిఫ్… సీటును గెలిచినోడు …అందరు కూడా ప్రస్తుతానికి అజ్ఞాతవాసం లో ఉన్నారా అనేలా ఇక్కడ వారి ఉనికే లేకుండా పోయారు.

ఈ నాలుగు పార్టీల నాయకుల నిర్లక్ష్యం తో విజయవాడ వెస్ట్ జోన్ రాజకీయంగా అనాధల మారిందంటున్నారు స్థానికులు. గెలిచినోడు అందుబాటులో ఉండడు, ఓడినోడు పట్టించుకోడు, త్యాగం చూసినోడికి సంబంధం లేదు, ఆశించినోడు కనిపించడు,

ఇలా ఈ నియోజకవర్గంలో ఎటు చూసిన అటు అధికార పార్టీ నేతలు కానీ ఇటు విపక్ష పార్టీ సభ్యలు కానీ రాజకీయంగా స్తబ్దుగానే ఉంటున్నారు. ఇలా అయితే రేపు రాబోయే ఎన్నికలలో ప్రజలు ఏ పార్టీ నాయకుడి వెంట నడవాలో కూడా అర్ధం కానీ స్థితికి చేరుకోవడం ఖాయం గా కనిపిస్తుంది.

ADVERTISEMENT
Latest Stories