ఆర్ధిక సంక్షోభంలో ఆంధ్రప్రదేశ్ కూరుకుపోయింది – ఇది స్వయంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వెల్లడించిన విషయం. ఇదే విషయాన్ని వైసీపీ ఎంపీలు పార్లమెంట్ వేదికగా కూడా వ్యక్తపరిచారు. అలాగే కేంద్ర హోమ్ శాఖామంత్రి అమిత్ షాకు కూడా వెల్లడించి, రాష్ట్రానికి నిధులు ఇవ్వాల్సిందిగా కోరారు.
ఇది క్లుప్తంగా ఏపీ దయనీయ ఆర్ధిక పరిస్థితిపై అధికార పక్షం ప్రకటనలు. రాష్ట్రానికి ఆదాయం వచ్చే అభివృద్ధి లేకుండా సంక్షేమం పేరుతో పంపకాలు చేస్తే ఇలా ఆర్ధికంగా దివాళా తీయడం తప్ప, జగన్ రెడ్డి ప్రభుత్వానికి ఏమి చేత అవుతుంది? అనేది ప్రతిపక్షాలు చేస్తోన్న విమర్శలు.
ఏది ఏమైనా ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితిలో కూడా ఏపీ లేదన్నది సుస్పష్టం. దానికి ప్రతిపక్షం చెప్పే కారణాలు నిజమైయుండొచ్చు, అలాగే అధికార పక్షం వారి వాదనలో కొంతైనా వాస్తవం ఉండొచ్చు. మరి అంత దయనీయ పరిస్థితిలో ఉన్న రాష్ట్రం ఖర్చులను తగ్గించుకోవాల్సింది పోయి, విచ్చలవిడిగా ఖర్చులు చేయడాన్ని నెటిజన్లు తప్పు పడుతున్నారు.
100 మంది సభ్యులున్న జీవీఎంసిఏ సమావేశంలో ఒక్క రోజు టీ మరియు కాఫీలకు అయిన ఖర్చు అక్షరాలా నాలుగు లక్షల పన్నెండు వేల రూపాయలు. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పేదరికంలో ఒక్క రాష్ట్రం తరపున బాధ్యత గల అధికారులు ఖర్చు పెట్టే విధానానికి నిదర్శనంగా నిలుస్తోంది ఈ ఉదంతం.
“అఖండ” డైలాగ్ తో అధికార పక్షం తీరును ట్రోల్ చేయడం నెటిజన్ల వంతవుతోంది. “ఏపీ పేదరికంలో ఉంది – జగన్ సర్కార్ ఓ రోజు టీ / కాఫీ ఖర్చు 4,12,000/-” బోత్ ఆర్ నాట్ సేమ్ అంటూ సందడి చేస్తున్నారు.
100 మంది సభ్యులున్న జీవీఎంసీలో ఒక్క రోజు టీ / కాఫీ ఖర్చు 4,12,000/-.
స్ట్రాంగ్ టీ…????
🙄🙄#SaveAPFromYCP pic.twitter.com/uI8uzvOsOz— 💝సుజత్° 🚲 🅰️🅿️TDP ॐ†☪︎{గిరిజనబిడ్డని} (@SujathTDPKadiri) December 12, 2021
AP is poor state : CM
జగన్ ప్రభుత్వ ఒక రోజు కాఫీ/టీ ఖర్చులు Rs 4,12,000/-
Both are not same
— Geetha_గీత™️😍✌️ (@Geetha_Happy) December 13, 2021



