పెళ్లిపై శపథం చేసిన మాస్ హీరో!

స్వతహాగా తెలుగు వాడై తమిళంలో రాణిస్తున్న హీరో విశాల్ తాజాగా ఓ శపథం చేశాడు. దక్షిణ భారత నటీనటుల సంఘం భవన నిర్మాణం పూర్తయిన తర్వాతే తాను పెళ్లి చేసుకుంటానని సంచలన ప్రకటన చేసాడు. సంఘం నూతన భవన నిర్మాణానికి చెన్నైలోని టి.నగర్ అబీబుల్లా రోడ్డులో అగ్ర నటులు రజనీకాంత్, కమల్ హాసన్ చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది.

ADVERTISEMENT

ఈ సందర్భంగా సంఘం కార్యదర్శి విశాల్ మాట్లాడుతూ… ఈ భవన నిర్మాణాన్ని ఆపడానికి చేసే ప్రయత్నాలను అధిగమించి పూర్తి చేస్తామని చెప్పారు. వచ్చే ఏడాది సెప్టెంబర్ నాటికి పూర్తి చేసి ప్రారంభిస్తామని, అప్పటివరకు తాను పెళ్లి చేసుకోనని అన్నారు. ఈ కార్యక్రమంలో అజిత్, సత్యరాజ్, సూర్య, శింబు, అరుణ్ విజయ్, శివకుమార్, శారద, కాంచన, వైజయంతీ మాల, కోవైసరళ, లత ఇంకా చాలా మంది నటీనటులు పాల్గొన్నారు.

ADVERTISEMENT
Latest Stories