ఆగస్ట్ 22న చిరంజీవి బర్త్ డే సందర్భంగా విడుదల కావాల్సిన కంటెంట్ ఇది. అయితే VFX work ఇంకా బెటర్ గా ఉండాలని చివరి నిమిషంలో వాయిదా వేశారు.
రెండు నెలల టైం తీసుకుని తెచ్చిన బెస్ట్ అవుట్‌పుట్ ఇది. అయితే ఇప్పుడు వస్తున్న రెస్పాన్స్ బట్టి ఇది ఏ మాత్రం సరిపోదు అని అర్థం అవుతుంది.
రెండు నెలలు వర్క్ చేసినా అవుట్‌పుట్ ఎందుకు రాలేదు? వర్క్ చేసిన కంపెనీల కెపాసిటీ సరిపోలేదా? బడ్జెట్ సరిపోలేదా? లేక డైరెక్టర్ ఆడియెన్స్ ఎక్స్పెక్టేషన్స్ ను తక్కువ అంచనా వేయడం వల్లనా? కెమెరా మ్యాన్ ఎంపికలో ఏమైనా ప్రాబ్లం వచ్చిందా?
VFX అనేది డైరెక్టర్ విజన్ ఒక్కటే కాదు, ముఖ్యంగా బడ్జెట్ మీద కూడా బాగా డిపెండ్ అయ్యే డిపార్ట్మెంట్.
ఈవెంట్ సినిమాల హవా మొదలయ్యాకా VFX విషయంలో ఆడియెన్స్ ఎక్స్పెక్టేషన్స్ బాగా పెరిగాయి. మరీ సోషల్ మీడియా లో లాగా మెర్సిలెస్ గా నార్మల్ ఆడియెన్స్ ఉండకపోయినా మినిమం క్వాలిటీ అయితే ఉండాలి.
టీజర్ కే స్ట్రగుల్ అయితే మొత్తం సినిమా VFX ఎలా? డైరెక్టర్ మొత్తం VFX ప్రాజెక్ట్ రివ్యూ చేసుకోవాలి.
సంక్రాంతి డేట్ ఎలాగూ మిస్ అయ్యింది కాబట్టి మే 9 రిలీజ్ అంటే ఇంకో నాలుగు నెలల టైం దొరుకుతుంది కాబట్టి దానిని సరిగ్గా వాడుకోవాలి.




