అప్పటికి పుణ్యకాలం కాస్త గడిచి పోతుందేమో లక్ష్మీనారాయణ గారు

vv lakshmi narayanaఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే ఎన్నికల సందడి మొదలయిపోయింది. అన్ని పార్టీలు శక్తివంఛన లేకుండా తమ ప్రయత్నాలు తాము చేస్తున్నాయి. అయితే మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ మాత్రం ఇంకా రాజకీయ అరంగేట్రం గురించి తేల్చడం లేదు. ఇప్పటికి ఆయన రాష్ట్రంలో 10 జిల్లాలు పర్యటించారు.

[m9ad]

ADVERTISEMENT

రాష్ట్రంలో కృష్ణా, గుంటూరు, చిత్తూరు జిల్లాలు మాత్రమే మిగిలి ఉన్నాయని… ఆ జిల్లాల పర్యటన పూర్తయిన తర్వాత ప్రజా సమస్యలపై సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందజేసి పరిష్కరించాలని కోరుతానని పేర్కొన్నారు. అది సాధ్యం కాకపోతే… 13 జిల్లాల పర్యటన తర్వాత తన రాజకీయ రంగ ప్రవేశంపై నిర్ణయం తీసుకుంటానన్నారు.

ప్రజా సమస్యల పరిష్కారానికి రాజకీయ రంగమే శ్రేయస్కరమని భావిస్తే రాజకీయాల్లోకి రావడానికి కూడా వెనకాడే ప్రసక్తే లేదని ఆయన చెబుతున్నారు. అయితే ఇవన్నీ జరిగేటప్పటికీ పుణ్యకాలం కాస్త గడిచి పోతుందేమో లక్ష్మీనారాయణ గారు. ఎంతో ముందుగానే తన ప్రయత్నాలు మొదలు పెట్టిన పవన్ కళ్యాణ్ కే సమయం సరిపొవట్లేదని విశ్లేషకుల అభిప్రాయం.

ADVERTISEMENT
Latest Stories