ఇంతకీ ముద్రగడ పవన్‌ కళ్యాణ్‌ని ఎందుకు ద్వేషిస్తున్నారు?

YSRCP Mudragada-Padmanabham-Pawan-Kalyan

ఒక వ్యక్తి లేదా ఓ పార్టీని ప్రజలు అభిమానించడానికి, ద్వేషించడానికి అనేక కారణాలు ఉంటాయి. కానీ ఏ కారణమూ లేకుండానే పవన్‌ కళ్యాణ్‌ను ముద్రగడ పద్మనాభం తీవ్రంగా వ్యతిరేకిస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తుంది.

ADVERTISEMENT

ఆయన కాపులలో పెద్ద మనిషి కనుక పవన్‌ కళ్యాణ్‌ స్వయంగా ఆయన ఇంటికి వెళ్ళి కలవాలనుకున్నారు కానీ పార్టీ కార్యక్రమాలతో ఒత్తిడి కారణంగా కలవలేకపోయారు.

టిడిపి, బీజేపీలతో పొత్తుల కోసం జనసేనలోనే కొంతమంది అభ్యర్ధులకు పవన్‌ కళ్యాణ్‌ టికెట్స్ ఇవ్వలేకపోయారు. కనుక జనసేన పార్టీలోనే లేని ముద్రగడ పద్మనాభంకు టికెట్‌ ఇవ్వలేకపోతే అదేమీ పెద్ద నేరం కాదు. కానీ అదే పెద్ద నేరం అన్నట్లు ముద్రగడ పద్మనాభం వెళ్ళి వైసీపిలో చేరిపోయారు.

నిజానికి టికెట్‌ విషయంలో పవన్ కంటే జగన్‌ వ్యవహరించిన తీరుకే ఆయన చాలా బాధ పడ్డారు. కానీ పవన్‌ కళ్యాణ్‌ మీద కోపంతో వెళ్ళి అదే జగన్మోహన్‌ రెడ్డి పంచన చేరారు.

పోనీ… జగన్మోహన్‌ రెడ్డి ఆయనకు టికెట్‌ ఇచ్చారా? అంటే లేదు. మరి జగన్‌ పంచన ఎందుకు చేరిన్నట్లు?జగన్ కంటే తీవ్రంగా పవన్‌ కళ్యాణ్‌ మీద ఎందుకు విరుచుకు పడుతున్నారు?బలమైన కారణం ఏమైనా ఉందా అంటే కనిపించదు. ఎందుకో ఆయన కూడా చెప్పలేకపోతున్నారు.

పవన్‌ కళ్యాణ్‌ చంద్రబాబు నాయుడుకి దత్తపుత్రుడు అని జగన్మోహన్‌ రెడ్డి ఎద్దేవా చేస్తుంటారు. మరి ముద్రగడ పద్మనాభం కూడా జగన్మోహన్‌ రెడ్డికి దత్తపుత్రుడే అనుకోవాలా? పవన్‌ కళ్యాణ్‌ ప్యాకేజ్ స్టార్ అయితే ముద్రగడ పద్మనాభం కూడా ప్యాకేజ్ స్టార్ అనే అనుకోవాలా?

కారణాలు ఏవైనప్పటికీ ముద్రగడ పద్మనాభం పవన్‌ కళ్యాణ్‌కు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కనుక పిఠాపురం నుంచి పవన్‌ కళ్యాణ్‌ని తన్ని తరిమేయాలని అన్నారు. చివరికి పవన్‌ కళ్యాణ్‌పై ఆయన ద్వేషం ఉన్మాద దశకు చేరుకున్నట్లుంది. పవన్‌ కళ్యాణ్‌ని ఓడించలేకపోతే తన పేరు ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానని శపధం చేయడమే ఇందుకు నిదర్శనం.

కానీ ఎందుకు? అని ప్రశ్నిస్తే ఆయన సరైన సమాధానం ఇవ్వలేకపోవచ్చు కానీ ఎవరి కోసం ఓడించాలనుకుంటున్నారు?అంటే జగన్‌ కోసమని ఖచ్చితంగా చెపుతున్నారు. కాపుల ఓట్లను పవన్‌ కళ్యాణ్‌ టిడిపికి మళ్ళిస్తున్నారని విమర్శిస్తున్నప్పుడు మరి ముద్రగడ పద్మనాభం చేస్తున్నదేమిటి?

జగన్‌ ఆయనను నయాన్నో భయన్నో లొంగదీసుకున్నారని అర్దమవుతూనే ఉంది. అందుకే ఆయన ఇంత అనూహ్యంగా జగన్మోహన్‌ రెడ్డికి వీరవిధేయుడుగా మారిపోయారు. ఆ కారణం ఏమిటో ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఎలాగూ బయటపడుతుంది. కానీ ఆలోగా జగన్‌ కోసం కాపుల ఓట్లను నిలువునా చీల్చి కాపు జాతికి ముద్రగడ పద్మనాభం తీరని ద్రోహం చేస్తున్నారని చెప్పక తప్పదు.

ADVERTISEMENT
Latest Stories