జగన్ ఎందుకు వద్దన్నట్టు?

why jagan said noతెలంగాణలో మంత్రులు ఒకరి తరువాత ఒకరు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ని తూలనాడుతున్నారు అయితే వైఎస్ ఫోటో పెట్టుకుని రాజాన్న రాజ్యం తెస్తాం అంటూ అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు మాత్రం ఎందుకనో స్పందించడం లేదు. అయితే ఎందుకు స్పందించడం లేదు అనేదాని మంత్రి అనిల్ ఒక సమాధానం చెప్పుకొచ్చారు.

తెలంగాణ ప్రభుత్వం లేనిపోని రాద్ధాంతాన్ని సృష్టిస్తోందని.. నీటిపారుదల సమస్యను సామరస్యంగా పరిష్కరించరించేందుకు కృషి చేస్తున్న సమయంలోనే, తెలంగాణ మంత్రులు ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం బాగోలేదని ఆయన అన్నారు. ఆ మాటలను తెలంగాణ మంత్రుల విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నారు.

ADVERTISEMENT

తమ నాయకుడిని ఇష్టమొచ్చినట్లు మాట్లాడతున్నారని, తామూ అలా మాట్లాడగలమని, అయితే సామరస్యంగా పరిష్కరించుకుందామని సీఎం అన్నందుకే అలా మాట్లాడటం లేదని వివరించారు. ఇక్కడ విచిత్రం ఏమిటంటే… ఇప్పటికే చర్చల ప్రతిపాదనను తెలంగాణ సీఎం కేసీఆర్ తిరస్కరించారు. ప్రోజెక్టులకు సంబందించిన జీవోలను వెనక్కు తీసుకుంటేనే చర్చలు అన్నారు.

ఇక ఈ వివాదాల పరిష్కారం కోర్టులలోనో…. కేంద్రం పరిధిలోనో పరిష్కరింపబడాలి. ఆ లోగా వైఎస్ ను మాటలు అంటున్నా పడతారా? వీరే ఉన్న దానికి లేని దానికి ప్రతిపక్ష పార్టీల మీద ఒంటి కాలి పై విరుచుకుపడతారు. మరి తెరాస మీద ఈ వల్లమాలిన అభిమానం ఎందుకో మరి!

ADVERTISEMENT
Latest Stories