KCR Announce His Political Retirement

2023 తెలంగాణ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ ఓటమిని ఎదుర్కున్న నాటి నుంచి ఆ పార్టీ అధినేత కేసీఆర్ రాజకీయాలకు తాత్కాలిక బ్రేక్ తీసుకున్నారు. కేవలం ఫామ్ హౌస్ కు మాత్రమే పరిమితమవుతూ పార్టీ బాధ్యతలను, బిఆర్ఎస్ బరువును తన రాజకీయ వారసుడు కేటీఆర్ చేతిలో పెట్టినట్టుగా నాటి నుంచి పార్టీ పూర్తి స్థాయి రాజకీయ వ్యవహారాలను కేటీఆర్ నడుపుతున్నారు.

అలాగే ఇటు కేటీఆర్ తో పాటుగా అటు పార్టీలో సీనియర్ నాయకుడు, తెరాస ఆవిర్భావం నుండి కేసీఆర్ కు కుడి భుజం గా నిలిచిన హరీష్ రావు సైతం పార్టీ వ్యవహారాలను చక్కపెడుతున్నారు. ఇలా ఒకపక్క కేటీఆర్, మరోపక్క హరీష్ బిఆర్ఎస్ పార్టీకి అనధికారిక అధినేతలుగా ముందుండి నడిపిస్తున్నారు.

Also Read – యుద్ధాలు చేయకుండా అమెరికా ఉండలేదేమో

అయితే బిఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ తరువాత స్థానం ఎవరిదీ అనే ప్రశ్న తరచూ కేటీఆర్, హరీష్ ల మధ్య నడుస్తూనే ఉంటుంది. అయితే నేడు ఈ ప్రశ్నకు హరీష్ స్ఫష్టమైన జవాబిచ్చారు. బిఆర్ఎస్ పార్టీలో మీడియాలో ప్రచారమవుతున్న మాదిరి మా మధ్య విభేదాలేమి లేవని, తానెప్పుడూ కేసీఆర్ మాటను తూచా తప్పకుండ పాటించే ఒక పార్టీ కార్యకర్తనే అంటూ బదులిచ్చారు.

అలాగే నేను ఎప్పుడు కూడా కేసీఆర్ గీసిన గీత దాటను, కేసీఆర్ తీసుకున్న ఏ నిర్ణయానికైనా నేను పూర్తి మద్దతిస్తాను అంటూనే కేసీఆర్ తరువాత పార్టీ బాధ్యతలను ఆయన తనయుడు కేటీఆర్ కు అప్పగిస్తే తానూ ఖచ్చితంగా స్వాగతిస్తాను అంటూ స్ఫష్టమైన జవాబు చెప్పారు.

Also Read – ‘పోరు’ బాటలు కాదు ‘ప్రతీకార’ చర్యలే…


అయితే హరీష్ చేసిన ఈ వ్యాఖ్యలతో త్వరలో కేసీఆర్ రాజకీయ రిటైర్మెంట్ ప్రకటించబోతున్నారా.? తన రాజకీయ వారసుడిగా కేసీఆర్ తనయుడు, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు పార్టీ పగ్గాలు అప్పగించనున్నారా.? అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇప్పటికే పార్టీలో ఆదిశగా చర్చలు కూడా జరిగిపోయాయని, హరీష్ వ్యాఖ్యలతో ఈ ఊహాగానాలకు సమాధానం దొరికినట్లయ్యినట్లయ్యింది.