జగన్‌ వెంట నడిస్తే ముగింపు ఇలాగే ఉంటుందా?

ఎవరు అవునన్నా కాదన్నా జగన్‌ వెంట నడిచిన ప్రతీ ఒక్కరూ ఏదో రూపంలో మూల్యం చెల్లిస్తూనే ఉన్నారు. వారు వివేకానంద రెడ్డి, విజయసాయి రెడ్డి కావచ్చు లేదా వైఎస్ విజయమ్మ, షర్మిల కావచ్చు లేదా అధికారులు, వాలంటీర్లు కావచ్చు. ప్రతీ ఒక్కరూ ఏదో రూపంలో నష్టపోతూనే ఉన్నారు. కేసులు ఎదుర్కొంటూనే ఉన్నారు.

ఈవిదంగా ఎందుకు జరుగుతోంది?మనం తప్పుడు మార్గంలో నడుస్తున్నామా?మన నాయకుడు సరైనవాడు అవునా కాదా?అని ఆలోచించే బదులు రాజకీయ కక్షతోనే తమపై కేసులు నమోదు అవుతున్నాయని ప్రజలను నమ్మించేందుకు ప్రయత్నిస్తూ ఆత్మవంచన చేసుకుంటున్నారు.

ADVERTISEMENT

కూటమి ప్రభుత్వం వైసీపీ నేతలపై కక్షగట్టి వేధిస్తోందనే అనుకుందాం. కానీ ఏనాటికైనా ముఖ్యమంత్రి కావాలనే జగన్‌ కల నెరవేర్చడం కోసం ఎంతగానో శ్రమించిన వారందరూ ఎందుకు విడిచి పెట్టి వెళ్ళిపోతున్నారు?వారి పట్ల కనీస కృతజ్ఞత చూపకుండా వైసీపీ నేతల చేత, సొంత మీడియా చేత జగన్‌ బురద జల్లిస్తున్నారు కదా?

అంటే జగన్‌కి వారు ఎంత కాలం ఎంత విధేయంగా సేవలు చేసినప్పటికీ పార్టీ వీడితే బురద జల్లించకుండా విడిచిపెట్టరని స్పష్టమవుతోంది కదా?అంటే నేడు వారిపై బురద జల్లుతున్న వైసీపీ నేతలకీ రేపు ఇదే ట్రీట్‌మెంట్‌ లభిస్తుందని గ్రహించలేకపోతున్నారా?

అలాగని వారు పార్టీలో తనని అంటిపెట్టుకొని ఉన్నప్పుడైనా జగన్‌ వారికి సముచిత గౌరవం ఇచ్చారా?అంటే లేదని కోటం రెడ్డి, ఆనం రెడ్డి, మేకపాటి మొదలు విజయసాయి రెడ్డి వరకు ప్రతీ ఒక్కరూ చెపుతూనే ఉన్నారు కదా? వైసీపీలో తన ర్యాంక్ 2 నుంచి 2000 కి పడిపోయిందని, ఇక తనకు స్థానం లేదని గ్రహించిన తర్వాతే తాను చాలా బాధతో పార్టీని వీడానని విజయసాయి రెడ్డి చెప్పుకున్నారు కదా?

అక్రమాస్తుల కేసులో తనతో పాటు చంచల్‌గూడా జైలులో 16 నెలలు గడిపిన విజయసాయి రెడ్డినే జగన్‌ గౌరవించనప్పడు వాలంటీర్లను పట్టించుకుంటారా?అంటే సమాధానం అందరికీ తెలుసు.

ఏపీలో టీడీపీ, జనసేన, తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీలున్నాయి. కానీ వాటి నేతలకు ఇంతగా సమస్యలు, అవమానాలు ఎదుర్కోవడం లేదు. కానీ ఒక్క వైసీపీలో నేతలకే ఎందుకు?అని వైసీపీలో ప్రతీ ఒక్కరూ ఆలోచించుకోవాలి.

జగన్‌ తాను మహాద్భుతమైన నాయకుడు, మానవతావాది, ప్రజలకు మేలు చేయడం కోసమే ఈ భూమ్మీద అవతరించానని గట్టిగా నమ్ముతుండవచ్చు. అందరినీ నమ్మించే ప్రయత్నం చేయవచ్చు.

కానీ ఆయనకి కష్టకాలంలో అండగా నిలిచి దూరమైన తల్లి విజయమ్మ, షర్మిలతో సహా విజయసాయి రెడ్డి వరకు ప్రతీ ఒక్కరూ జగన్‌ ధోరణిని విమర్శిస్తున్నారు కదా?కనుక ఏ గట్టున ఉండాలో వైసీపీలో ప్రతీ ఒక్కరూ ఆలోచించుకోవడం చాలా అవసరమే.

ADVERTISEMENT
Latest Stories