విదేశీ వైద్యం ఖర్చును వాపస్ చేసిన యనమల

Yanamala Rama Krishnuduఈ ఏడాది ఏప్రిల్ లో సింగపూర్ ఓ ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గోనేందుకు వెళ్ళిన ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు అక్కడ. అత్యవసరంగా దంత చికిత్స అవసరం కావడంతో 2.88 లక్షలతో రూట్ కెనాల్ ట్రీట్ మెంట్ చేయించుకున్నారు. ఖర్చు చేసిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు చెల్లించింది.

ADVERTISEMENT

[m9ad]

దీనిపై ప్రతిపక్షాలు విమర్శలకు దిగడంతో ఆ వ్యయాన్ని తిరిగి ప్రభుత్వానికి చెల్లించారు. ఆ మొత్తాన్ని యనమల రామకృష్ణుడు ప్రభుత్వానికి తిరిగి చెల్లించారు. చలానా ద్వారా 2.88 లక్షల మొత్తాన్ని ప్రభుత్వ ఖజానాకు జమ చేశారు. అయితే కేవలం 2.88 లక్షల కోసం యనమల బిల్ పెట్టడమే తప్పు.

దానిద్వారా ప్రభుత్వాన్ని పార్టీనీ ఇబ్బంది పెట్టడం తప్ప మరొకటి కాదు. ఇప్పుడు ఇంత రాద్ధాంతం జరిగాక డబ్బులు వాపసు ఇచ్చేశాం అంటే చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టే. అది కూడా యనమల వంటి సీనియర్ నాయకుడు, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి అందరికంటే ఎక్కువ తెలిసిన ఆయన చెయ్యడం బాధాకరం.

ADVERTISEMENT
Latest Stories