Jagan Pawan Kalyan

వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ శుక్రవారం శాసనసభ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ, “శాసనసభలో వైసీపీ, కూటమిలోని మూడు పార్టీలున్నాయి. ఆ మూడూ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నందున వాటిలో ఎక్కువ సీట్లున్న జనసేనకు ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదా ఇవ్వలేదు. కనుక ప్రతిపక్షంలో ఉన్న మా పార్టీకి ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదా ఇవ్వాలి. ఇది మా హక్కు.

కానీ నిరాకరిస్తున్నందున పవన్ కళ్యాణ్‌ కూటమి నుంచి బయటకు వచ్చేసి ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదా చేపడితే మాకు అభ్యంతరం లేదు. కానీ అది సాధ్యం కాదనుకుంటే మా పార్టీకి ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదా ఇవ్వాలి,” అని అన్నారు.

Also Read – అయ్యో! మన హిస్టరీ అంతా అలా చెప్పేస్తున్నారేమిటి?

బొత్స సత్యనారాయణ జగన్‌ మనసులో మాటణే చాలా లాజిక్‌గా మాట్లాడుతున్నారని అర్దమవుతూనే ఉంది.

జనసేన, టీడీపీలు కలిస్తే ఎన్నికలలో తమ ఓటమి ఖాయమని అందరికంటే ముందు పసిగట్టిన వ్యక్తి జగన్‌. అందుకే అవి కలవకుండా అడ్డుకునేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లను అనరాని మాటలన్నారు. కానీ అవన్నీ బెడిసికొట్టాయి.

Also Read – బెట్టింగ్ రాజాలు…సిద్ధమా.?

కానీ నేటికీ కూటమి నుంచి జనసేనని వేరు చేసి బయటకు తీసుకురావలనే ప్రయత్నాలు మానుకోవడం లేదు. అందుకు బలమైన కారణమే ఉంది.

టీడీపీ, జనసేనలను విడదీయడం ఇక సాధ్యం కాదని వైసీపీ చేతులు ముడుచుకొని కూర్చుంటే కూటమిలో మూడు పార్టీల మద్య బంధం మరింత బలపడుతుంది. అప్పుడు 2029 ఎన్నికలలో వైసీపీకి ఈ 11 సీట్లు కూడా రాకపోవచ్చు.

Also Read – అందరికీ సారీ.. అదిదా సర్‌ప్రీజు!

కనుక వైసీపీకి ఏకైక ఆశా కిరణంగా కనిపిస్తున్న పవన్ కళ్యాణ్‌ని ఏదో విదంగా కూటమిని బయటకు రప్పించాలి. రప్పించగలిగితే కూటమిని విచ్చినమై ప్రభుత్వం పడిపోతుందని జగన్‌ ఆశపడుతున్నారు. ఆ ప్రయత్నాలలో భాగంగానే చంద్రబాబు నాయుడు-పవన్ కళ్యాణ్‌లకు, పవన్ కళ్యాణ్‌-నారా లోకేష్‌లకు పడటంలేదని, పవన్ కళ్యాణ్‌ని చంద్రబాబు నాయుడు పట్టించుకోవడం లేదంటూ జగన్‌ దుష్ప్రచారం చేయిస్తూనే ఉన్నారు.




కానీ నాగబాబుకి ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ సీటు ఇవ్వడం ద్వారా ఆ దుష్ప్రచారానికి చంద్రబాబు నాయుడు చెక్ పెట్టారు. కానీ ముందే చెప్పుకున్నట్లు పవన్ కళ్యాణ్‌ని బయటకు లాగి, కూటమిని విచ్చినం చేసేవరకు వైసీపీ ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఆ ప్రయత్నంలోనే బొత్స కూడా ఓ రాయి వేశారనుకోవచ్చు.