ఇక వైకాపా నేతలకు ఈ వంద రోజులు ఇదే పనా..?

YCP Leaders

ఎన్నికలకు సమయం దగ్గర పడడంతో ఆందోళనతో అధికార పక్షం, ఆశలతో ప్రతిపక్షం, ఆవేశంతో నిరసన కారులు ఇలా ఎవరి తీరులో వారు ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రతిపక్ష పార్టీల మీద ఎటాకింగ్ గేర్ లోనే ముందుకెళ్తుంది.

అయితే ప్రతిపక్ష పార్టీల విమర్శలకు, ప్రశ్నలకు..,మాట దాటేస్తూ, విషయాన్ని పక్కదారి పట్టిస్తూ,ప్రత్యర్థుల పై మాటల దాడితో ముందుకెళ్ళిందే కానీ ఎప్పుడు సమాధానం చెప్పే ధోరణిలో అడుగులు వెయ్యలేదు వైసీపీ ప్రభుత్వం. కానీ ఎన్నికలలకు వంద రోజుల సమయమే ఉండడంతో కుదిరితే ఎటాకింగ్ కుదరకపోతే డిఫెంసింగ్ విధానాన్ని ఎంచుకున్నట్టుంది వైసీపీ.

ADVERTISEMENT

ముందుగా తన ఎటాకింగ్ పద్దతిని కొనగిస్తూ మంత్రి సిదిరి అప్పలరాజు మీడియా ముందుకొచ్చారు. టీడీపీ – జనసేన పొత్తు పాలితమేంటో ఒక సారి అనుభవించిన వైసీపీ నేతలు ఇప్పుడు మరల రెండు పార్టీల మధ్య చిగురించిన పొత్తును మొగ్గలోనే తుంచివేయాలని అటు జనసైనికులను, ఇటు పవన్ అభిమానులను రెచ్చగొట్టేందుకు అలుపెరగని ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.

2024 ఎన్నికల తరువాత జనసేన పార్టీ టీడీపీ పార్టీలో విలీనమై ఏపీలో కనుమరగు అవుతుందని సిదిరి జోస్యం చెప్పుకొచ్చారు. బాబుకి ఊడిగం చేయడానికే పవన్ పార్టీ పెట్టాడు అంటూ జనసైనికులను రెచ్చగొట్టి ఆ మంటలో వైకాపా నాయకులు చలి కాసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అలాగే డిప్యూటీ సీఎం నారాయణ స్వామి చంద్రబాబు ఒక డెకాయిట్ అంటూ వైసీపీ భాషను మొదలుపెట్టారు.

రానున్న ఎన్నికలలో చంద్రబాబు ఆ పీకే, ఈ పీకే లను వెంటేసుకొని వచ్చిన ఏపీలో పీకేదేమ్ లేదంటూ తెగ పీక్కుంటున్నారు. బాబు పీకేదేమి లేనేప్పుడు జగన్ ఇంచార్జ్ లను ఎందుకు పీకుతున్నాడో కాస్త చెప్పండి సార్ అంటూ అంటే ఘాటుగా బదులిచ్చారు టీడీపీ శ్రేణులు. ఈ సారి ఎన్నికలలో జగన్ ఇంచార్జ్ లను మార్చినా ఎమ్మెల్యే లను మార్చినా రాష్ట్రంలో ప్రజలు “వైసీపీ జెండా పీకడం” ఖాయం అంటూ హెచ్చరిస్తున్నారు టీడీపీ నాయకులు.

ఇక డిఫెన్స్ విషయానికి వస్తే.., తమకు టికెట్ ఇచ్చినా ఇవ్వకున్నా జగనన్న వెంటే నడుస్తాం అంటూ జగన్ ఎమ్మెల్యే టికెట్ క్యాన్సిల్ చేసిన నాయకులు తమను, తమ పార్టీని ప్రతిపక్ష పార్టీల విమర్శల నుండి డిఫెన్స్ చేసుకునే పనిలో బిజీగా ఉన్నారు. అందులో ముఖ్యంగా మంత్రి రోజా. ఈసారి నగరి టికెట్ కు జగన్ నో చెప్పినట్టు వార్తలు ఊపందుకోవడం పై స్పందించిన రోజా నాకు టికెట్ నిరాకరించిన మనస్ఫూర్తిగా వదులుకుంటా..అంటూనే అయినా జగన్ అలా చేయరనే ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ వర్గంలోనే జోగి రమేష్ కూడా చేరారు.గత నాలుగున్నరేళ్ల కాలం నుండి తమ పదవుల ఆశ కోసమో,ఉన్న పదవులను కాపాడుకోవాలనే ఆత్రుతతోనో ప్రతిపక్ష పార్టీల అధినేతల పైన తమ అధినేత ఇష్టానుసారంగా నోటికి పని చెప్పిన ప్రతి వైసీపీ ఎమ్మెల్యే కు ఇపుడు ఇదే పరిస్థితి దాపరించింది.

టికెట్ వస్తుందో రాదో చివరి నిమిషం వరకు తెలియదు. అలా అని పక్క పార్టీల వైపు చూసే పరిస్థితి లేదు.ఇలా లోలోపల మదన పడుతూ, పైపైకి కవర్ చేస్తూ, మీడియా ముందు ప్రత్యర్థులను తూలనాడుతూ ఈ వంద రోజుల కాలం ఇలానే వెళ్లబుచ్చాల్సి ఉంటుంది.

ADVERTISEMENT
Latest Stories