గురువింద గింజ తన కింద ఉన్న మచ్చను మరిచిపోయి అందరిని హేళన చేస్తుంది అన్నటుగా వైసీపీ నాయకులు తమ పార్టీ కింద, తమ అధినేత కింద ఉన్న మచ్చలు మరిచిపోయి ప్రత్యర్థుల మీద కయ్యానికి కాలు దూకుతుంటారు. 2019 ఎన్నికలలో వైసీపీ పార్టీ విజయం సాధించడానికి ప్రశాంత్ కిషోర్ అనే ఎన్నికల వ్యూహకర్త ఆలోచనలను వాడుకుని పీకే నీ పొగడ్తలతో ముంచేసిన వైసీపీ నేతలు ఇప్పుడు ఆయన బాబుని కలవగానే పీకే మీద ఎదురుదాడికి సిద్ధమయ్యారు.
అంబటి మాట్లాడుతూ ఈ పీకే, ఆ పీకే ఇద్దరు కూడా వైసీపీ పార్టీని ఏం చెయ్యలేరంటూ వీరంగాలు పోతే, మచిలీపట్టణం ఎమ్మెల్యే మాజీ మంత్రి పేర్ని నాని మరో అడుగు ముందుకేసి మేము వద్దనుకుని ‘ఛీ’ కొట్టిపడేసిన వారిని ఎంతమందిని బాబు తెచ్చుకున్నా జగన్ గెలుపుని ఆపలేరు అంటూ కనీస కృతజ్ఞత భావం కూడా లేకుండా మాట్లాడిన విధానం చూసి వైసీపీ పార్టీ డిఎన్ఏ లోనే కృతజ్ఞతా భావానికి స్థానం ఉండదు అనుకుంటా అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు.
గతంలో జగన్ జైల్లో ఉన్నప్పుడు పార్టీ బాధ్యతను, భారాన్ని తన భుజాన వేసుకుని రాష్ట్రమంతా పాదయాత్ర చేసి పార్టీని నిలబెట్టిన చెల్లి షర్మిలను, తండ్రి లేని బిడ్డ మీ కోసం వస్తున్నాడు అంటూ ప్రజలలో జగన్ పట్ల సింపతిని సృష్టించిన తల్లి విజయమ్మను పార్టీ అధికారంలోకి రాగానే రాష్ట్రము నుంచి తరిమేసిన జగన్ ను వైసీపీ నేతలందరూ ఆదర్శంగా తీసుకున్నారనుకుంటా అంటూ పేర్ని నానికి కౌంటర్ ఇస్తున్నారు టీడీపీ నేతలు.
తల్లి, చెల్లి పట్లే కృతజ్ఞత చూపని వైసీపీ డిఎన్ఏ లో ఇక ప్రశాంత్ కిషోర్ పై ఏవిధంగా కృతజ్ఞత చూపగలరు అంటూ తమలో తాము సర్ది చెప్పుకుంటున్నారు టీడీపీ శ్రేణులు. గతంలో టీడీపీ పార్టీ నేతలు ప్రశాంత్ కిషోర్ పై విమర్శలు చేశారు అని గుర్తుపెట్టుకున్న వైసీపీ నాయకులు అదే గతంలో జగన్ తో సహా 175 నియోజకవర్గాలలో పోటీ చేసిన ప్రతి ఒక్క వైసీపీ నాయకుడు ఇదే ప్రశాంత్ కిషోర్ ఆదేశాలను తూచా తప్పకుండా అనుసరించలేదా…? అంటూ ప్రశ్నిస్తున్నారు టీడీపీ నాయకులు.
రాజకీయాలలో ఎవరు ఎంతవరకు గుర్తు ఉంచుకోవాలో అంత వరకే గుర్తుంచుకుంటారని కొత్తగా తెలుసుకొనవసరం లేదనుకుంటా.!




