తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం బొటాబొటి మెజార్టీతో అధికారంలోకి వచ్చింది కనుక కూలిపోకుండా కాపాడుకునేందుకు ఎమ్మెల్యేల ఫిరాయింపజేసుకుంది. ఏపీ కూటమి ప్రభుత్వానికి పూర్తి మెజార్టీ ఉంది. కనుక ఆ అవసరమే లేదు.
కానీ ప్రభుత్వాలు మారినప్పుడు ప్రతిపక్ష పార్టీలో నేతలు అధికార పార్టీలలోకి జంప్ చేస్తుండటం సాధారణమే. ఇప్పుడు ఏపీలో కూడా ఇదే జరుగుతోంది.
Also Read – సంక్రాంతికి వస్తున్నాం అన్నారు.. మరిచిపోకండి సార్లూ
ఇప్పటికే పలువురు సీనియర్లు వైసీపీకి రాజీనామా చేసి టీడీపీ, జనసేనలలో చేరిపోయారు. ఇవాళ్ళ ఒక్కరోజే మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్, భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ వైసీపీకి రాజీనామాలు చేశారు. కొద్ది రోజుల క్రితమే ముగ్గురు రాజ్యసభ సభ్యులు వైసీపీకి రాజీనామాలు చేసిన సంగతి తెలిసిందే.
కనుక టీడీపీ నేతలందరూ రాష్ట్రంలో వైసీపీ దుకాణం త్వరలో బంద్ అవుతోందని సంతోషపడాలి కానీ ఆందోళన చెందుతున్నారు.
Also Read – కౌశిక్ రెడ్డి…పార్టీ కోసమా..? పేరు కోసమా.?
వైసీపీ నుంచి వారు నేరుగా టీడీపీ లేదా జనసేనలోనే చేరుతారని వేరే చెప్పక్కరలేదు. తాము ఇంతకాలం ఎవరితో పోరాడామో, ఎవరిని అవినీతిపరులని నిందించామో, ఎవరు తమని వేధించారో వారే తమ పార్టీలలో చేరుతుంటే భరించడం, వారితో కలిసి పనిచేయడం చాలా కష్టమే.
అంతే కాదు… అలా వచ్చినవారికే పదవులు దక్కుతుండటంతో, కష్టకాలంలో పార్టీని అంటిపెట్టుకొని పనిచేసిన తమకు అన్యాయం జరుగుతోందని ఆవేదన చెందడం సహజం.
Also Read – ఆర్జీవీ…’మెగా’ సెటైర్స్..!
ఇందుకు తాజా ఉదాహరణగా వైసీపీకి రాజీనామా చేసిన ముగ్గురు రాజ్యసభ సభ్యులలో ఒకటి బీజేపి (ఆర్ కృష్ణయ్య)కి పోయింది. మరొకటి టీడీపీలో చేరిన వైసీపీ ఎంపీ బీద మస్తాన్ రావు దక్కించుకున్నారు. ఒక్క సీటు సానా సతీష్ (టీడీపీ)కి దక్కింది. అంటే టీడీపీ, జనసేనలకు దక్కాల్సిన మూడు సీట్లలో రెండు వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకే దక్కాయన్న మాట! జనసేన ఒక సీటు ఆశించి భంగపడింది.
ఇప్పుడు అవంతి శ్రీనివాస్, గ్రంధి శ్రీనివాస్ వైసీపీకి రాజీనామాలు చేసి టీడీపీ, జనసేనలవైపే చూస్తారు. వారితో వైసీపీ రాజీనామాలు ఆగేవి కావు. వైసీపీలో ఇంకా చాలా మంది చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూస్తున్నారు.
కనుక వారిని చేర్చుకుంటే ఆ మేరకు వైసీపీ బలహీనపడినప్పటికీ, టీడీపీ, జనసేన సీనియర్ నేతలు కూడా నష్టపోయే అవకాశం ఉంటుంది. కనుక వైసీపీ నేతల రాజీనామాలు టీడీపీ, జనసేన నేతలు జీర్ణించుకోవడం కష్టమే.