ప్రత్యేక హోదా వచ్చేస్తాదని టీడీపీ ఎంపీలు రాజీనామా చేయ్యలేదట!

YS Jagan about Chandrababu naidu strand on AP Special Statusవిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎంపీల రాజీనామాలపై కొత్త పల్లవి అందుకున్నారు. తమ ఐదుగురు ఎంపీలు చేసినది వెలకట్టలేని త్యాగమని భావి తరాలకు స్ఫూర్తి అని చెబుతూనే చంద్రబాబు నాయుడు టీడీపీ ఎంపీలతో రాజీనామాలు చేయించలేదని దుయ్యబట్టారు. వారు రాజీనామా చేస్తే కేంద్రం దిగి వచ్చేదని చెప్పుకొచ్చారు.

“రాష్ట్రంలో ఉన్న 25 మంది ఎంపీలు రాజీనామాలు చేస్తే కేంద్రం దిగి వచ్చి ప్రత్యేక హోదా ఇచ్చేది. ప్రత్యేక హోదా వచ్చేస్తుందని చంద్రబాబు తన ఎంపీలతో రాజీనామాలు చేయించలేదు,” అని జగన్ ఆరోపించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా ప్రత్యేక హోదా వస్తే అందరికంటే ఎక్కువ లాభం చంద్రబాబుకే.

ADVERTISEMENT

మరి అది రాకుండా ఎందుకు చేస్తారో? 25 మంది ఎంపీలలో ఇద్దరు బీజేపీ వారు. ఒక ఎంపీ వైకాపా నుండి బయటకు వచ్చి బీజేపీ అనుబంధ సభ్యురాలిగా కొనసాగుతుంది. వారు ముగ్గురిని కూడా కలిపేసి టీడీపీ రాజీనామాలు చేస్తే మొత్తం ఎంపీలు చేసేసినట్టే అని చెప్పేశారు కూడా.

ADVERTISEMENT
Latest Stories