మూడు రాజధానులపై మరోసారి సీఎం జగన్ పరోక్ష వ్యాఖ్యలు

YS Jagan again comments on three capitals for andhra pradeshఆ కమిటీ ఈ కమిటి అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హడావిడి చేస్తున్నా మూడు రాజధానుల నిర్ణయం తీసేసుకున్నట్టే కనిపిస్తుంది. ఏలూరులో ఆరోగ్యశ్రీ పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం సందర్భంగా జరిగిన సభలో ముఖ్యమంత్రి జగన్ రాజధాని తరలింపుపై పరోక్షంగా క్లారిటీ ఇచ్చారు. మూడు రాజధానుల ఫార్ములాతో ముందుకెళ్తామని సంకేతాలిచ్చారు.

కొందరికే న్యాయం జరిగిందంటూ గత ప్రభుత్వ నిర్ణయాలపై సీఎం రాజకీయ విమర్శలు చేశారు. నాటి నిర్ణయాలను సరిదిద్దుతామన్నారు. అన్ని ప్రాంతాలకు నీళ్లు, నిధులు, పరిపాలన అందాలన్నదే తమ ప్రభుత్వ విధానమని జగన్ స్పష్టం చేశారు. తమ దృష్టిలో మూడు ప్రాంతాలూ సమానమేనంటూ రాజధానిపై పరోక్షంగా జగన్ క్లారిటీ ఇచ్చారు.

ADVERTISEMENT

“ప్రతి నిర్ణయానికి ప్రాతిపదిక, అందరూ, అన్ని ప్రాంతాలు బాగుండాలి. గ్రామం నుంచి రాష్ట్రం పరిపాలన వరకు అందరూ సమానమే. అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి, పరిపాలన ఫలాలు అందాలి. గతంలో అన్యాయంగా తీసుకున్న నిర్ణయాలను సరిదిద్దుతాం,” అంటూ ముఖ్యమంత్రి జగన్ తన ప్రసంగంలో చెప్పుకొచ్చారు.

మరోవైపు ప్రభుత్వం తమ ఆందోళనకు స్పందించకపోవడంతో రాజధానికి భూములిచ్చిన రైతులు ఈరోజు నుండి సకల జనుల సమ్మెకు ఉపక్రమించారు. ఇది ఇలా ఉండగా పోలీసులు పలువురు రైతులకు నోటీసులు జారీ చేసారు.. 307 హత్యాయత్నంతో పాటు మరో 7సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇవాళ సాయంత్రం 5గంటలకు చిలకలూరిపేట రూరల్ పోలీస్ స్టేషన్‌కు ఆధార్ కార్డుతో రావాలని 15 మందికి పైగా రైతులు, రైతు కూలీలకు నోటీసులు అందాయి.

ADVERTISEMENT
Latest Stories