జగన్, కేసీఆర్ కలిసి ఢిల్లీ వెళ్ళనున్నారా?

YS- Jagan and KCR to delhiవిజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో జరగనున్న జగన్‌ ప్రమాణస్వీకారానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ హాజరుకానున్న విషయం తెలిసిందే. ఒక రోజు ముందు కేసీఆర్‌ విజయవాడ చేరుకుంటారు. ప్రమాణస్వీకారం పూర్తయిన తర్వాత కేసీఆర్‌తో కలిసి జగన్‌ దిల్లీ వెళ్లే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. వీరివెంట అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకు చెందిన కొందరు సీనియర్‌ నేతలు కూడా పయనం కానున్నట్లు సమాచారం.

జగన్ స్వయంగా ఢిల్లీ వెళ్లి ప్రమాణస్వీకారానికి ప్రధానిని కూడా ఆహ్వానించారు. అయితే అదే రోజు మోడీ ప్రమాణస్వీకారం చెయ్యనుండడంతో ఆయన రావడానికి కుదరదు అని చెప్పినట్టు సమాచారం. ఇదే సమయం జగన్ ను తన ప్రమాణస్వీకారానికి ఆహ్వానించారు మోడీ. కేసీఆర్ కు అధికారంగా ఆహ్వానం అందినట్టు సమాచారం. గత కొంత కాలంగా జగన్ కేసీఆర్ కలిసి పని చేస్తున్నారు. ఇటీవలే జరిగిన ఏపీ ఎన్నికలలో కేసీఆర్ ప్రభుత్వం జగన్ పూర్తి స్థాయిలో అండగా నిలిచింది అనే వార్తలు వచ్చాయి.

ADVERTISEMENT

మోడీ కంటే ముందే కేసీఆర్ ను కలిసి జగన్ భవిష్యత్తులో కూడా కలిసి పని చేద్దాం అని మాట్లాడుకున్నట్టు సమాచారం. దీనితో వీరి సఖ్యత రాజకీయ వర్గాలలో చర్చకు దారి తీస్తుంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌ నూతన ముఖ్యమంత్రిగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 30న మధ్యాహ్నం 12 గంటల 23 నిమిషాలకు ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ రోజు జగన్ ఒక్కరే ప్రమాణస్వీకారం చేస్తారు… 10 రోజుల తరువాత మంత్రివర్గాన్ని విస్తరించే అవకాశం ఉంది.

ADVERTISEMENT
Latest Stories