మోడీ ని మోసం చేసిన జగన్… ఇంతకు మీరు ఏం చేస్తున్నట్టు?

YS Jagan - Narendra Modiఆదివారం ఒక్క రోజు 13 లక్షల కోవిడ్ వాక్సిన్ డోసులు వేసి రికార్డు సృష్టించామని జగన్ ప్రభుత్వం సోమవారం మీడియాలోను, సోషల్ మీడియాలోను పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంది. ఇది తమ వాలంటీర్ల, ప్రభుత్వ సమర్ధత అంటూ ఊదరగొట్టింది. అయితే సోమవారం రాత్రికి రాష్ట్ర బీజేపీ నాయకులు మేల్కొని… ఒక ప్రెస్ నోట్ విడుదల చేశారు.

ADVERTISEMENT

వ్యాక్సిన్లను అందించింది తామే అయినప్పటికీ.. వైసీపీ ప్రచారం చేసుకుంటోందని మండిపడుతోంది. యోగ దినోత్సవం నాడు రికార్డు నెలకొల్పాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు డోసులు ఎక్కువ పంపితే వాటిని ఒక రోజు ముందే వాడేసి వైఎస్ జగన్ వక్రబుద్ధిని ప్రదర్శించారని బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు.

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని తాము అనేక వ్యాక్సిన్ కేంద్రాలకు వెళ్తే అక్కడ అరకొరగా మాత్రమే వ్యాక్సిన్లు వేస్తున్నారని అదేమని అడిగితే వ్యాక్సిన్లు ముందే వేసేశాం అని చెప్పారని… ఒక్క చోట కూడా ప్రధాని మోడీ ఫొటో లేదని, అన్ని కేంద్రాల్లోనూ జగన్ చిత్రాలే కనిపించాయంటూ మండిపడ్డారు.

కేంద్ర ప్రభుత్వం నుంచి ఉచితంగా వ్యాక్సిన్లు తీసుకుని తామేదో ఘనకార్యం సాధించినట్లు జగన్ సర్కార్ ప్రచారం చేసుకుంటోందని ఆయన అన్నారు. ఇదంతా బానే ఉంది. ఆదివారం ఆంధ్రప్రదేశ్ లో అంత హడావిడి చేస్తుంటే బీజేపీ ఏం చేస్తున్నట్టు? సోమవారం వైఎస్సార్ కాంగ్రెస్ హడావిడి అంతా అయిపోయాకా రాత్రికి ఒక ప్రెస్ నోట్ విడుదల చెయ్యడం రాష్ట్ర బీజేపీ చేతగానితనమా లేక జగన్ సర్కారుకు సహకరించి చివరిలో మొక్కుబడి లేఖ రాసి మమ అనిపించడమా?

ADVERTISEMENT
Latest Stories