ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు రామ్ చరణ్ ఈరోజు ఉదయం కలవాల్సి ఉంది. ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్ కోరిన వెంటనే ముఖ్యమంత్రి కార్యాలయం స్పందించింది. నేటి ఉదయం 11 గంటలకు అపాయింట్‌మెంట్ ఖరారైంది. దీంతో చిరంజీవి తన కుమారుడు చరణ్‌తో కలిసి జగన్‌ను కలుస్తారని వార్తలు వచ్చాయి.
అయితే, నిన్న రాత్రి పొద్దపోయాక వీరి భేటీ వాయిదా పడింది. అనివార్య కారణాల వల్ల భేటీని 14వ తేదీకి వాయిదా వేశారు. చిరంజీవి, రామ్ చరణ్ ముఖ్యమంత్రిని తమ తాజా చిత్రం, సైరా నరసింహా రెడ్డి చూడాల్సిందిగా ఆహ్వానిస్తారట. సినిమాకు పన్ను మినహాయింపు ఇవ్వాల్సింది గా కోరతారని కూడా వార్తలు ఉన్నాయి.
కాగా, చిరంజీవి కోరిక మేరకు ఇటీవల తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కుటుంబంతో కలిసి సినిమాను వీక్షించారు. అద్భుతంగా ఉందంటూ చిరంజీవిని ప్రశంసల్లో ముంచెత్తారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని కలవనుండడంతో చిరంజీవి, రామ్ చరణ్ లు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలుస్తారని సమాచారం.
ఇది ఇలా ఉండగా సైరా కీలకమైన వారాంతంలోకి ప్రవేశించబోతుంది. ఈ వారాంతంతో దసరా సెలవుల అడ్వాంటేజ్ కూడా ముగిసిపోనుంది. కనీసం యావేరేజ్ అనిపించుకోవాలన్నా 80% రికవరీ ఉండాలి. ప్రస్తుత పరిస్థితులలో అది అంత తేలిక కాదని తెలుస్తుంది. అయితే ఇప్పటికే మిగతా భాషలలో సినిమా పూర్తిగా డల్ అయిపోయింది.



