కోడి కత్తి ఘటన తరువాత జగన్ ఈ రోజు తిరిగి పాదయాత్ర ప్రారంభించారు. ఒకరోజు ముందు ఆయన తల్లి విజయమ్మ మీడియా ముందుకు వచ్చి జగన్ కోసం సెంటిమెంటు పండించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆవిడ జగన్ ఏపీ పోలీసులకు సహకరించకపోవడం, దర్యాప్తు కేంద్ర ప్రభుత్వ సంస్థలకు అందించమని కోరడాన్ని సమర్ధించుకున్నారు. తమకు ఏపీ పోలీసుల మీద నమ్మకం లేకపోవడం కాదని ప్రభుత్వం మీదే నమ్మకం లేదని చెప్పారు ఆమె.
[m9ad]
“చంద్రబాబు ఏపీ పోలీసులను కాదని జెడ్ కేటగిరీ భద్రతను ఎందుకు ఉపయోగిస్తున్నారు? ప్రతిపక్షంలో ఉండగా సరే మరి అధికారంలోకి వచ్చాక కూడా ఎందుకు దానినే వాడుతున్నారు. ఆయనకు ఏపీ పోలీసుల మీద నమ్మకం లేదా?,” అని స్వతహా రాజకీయ నాయకురాలు కాని విజయమ్మ పార్టీ నాయకులు రాసిచ్చిన స్క్రిప్టుని చదివేశారు.
జగన్ కు చంద్రబాబు మీద నమ్మకం లేదు సరే.. కేంద్ర సంస్థల దర్యాప్తు కోరడమంటే మోడీ మీద నమ్మకం ఉందా? సోనియా గాంధీ టైములో నమ్మని సిబిఐని ఉన్నఫళంగా ఎందుకు మోడీ జమానాలో నమ్ముతున్నట్టో? మరోవైపు చంద్రబాబు జెడ్ కేటగిరీ భద్రతను వాడుతున్నారంటే అది రాష్ట్ర పోలీసులను నమ్మకపోవడం కాదు గతంలో ఆయన మీద మావోయిస్టుల దాడి జరిగింది కాబట్టి ఆయనకు సుక్షితులైన సెక్యూరిటీని కేటాయించింది. వారితో పాటు ఏపీ పోలీసులు కూడా చంద్రబాబు రక్షణా వలయంలో ఉంటారు.



