90% పూర్తి చేసిన ప్రాజెక్టులకు బాబు పునాధులు వెయ్యడమేంటి జగన్?

YS Jagan False Allegations on Chandrababu Naidu on Polavaranm Projectవిపక్షనేత జగన్ మోహన్ రెడ్డి చంద్రబాబు మీద చేస్తున్న విమర్శలలో లాజిక్ కొరవడుతోంది. కీలకమైన పోలవరం డయాఫ్రామ్ వాల్ కట్టుబడి పూర్తి అవ్వడంతో ఎక్కడ ప్రభుత్వానికి మంచి పేరువస్తుందో అని కలవరపాటుకు గురవుతున్నారు ఆయన. తూర్పు గోదావరి ప్రజా సంకల్పపాదయాత్రలో ఆయన మాట్లాడుతూ విచిత్రమైన కామెంట్లు చేసారు.

ADVERTISEMENT

ఎప్పుడు మా నాయన 70-90% పూర్తి చేసిన ప్రాజెక్టులకు చంద్రబాబు ఇప్పుడు పునాధులు మాత్రమే కట్టి తానే కట్టేసినట్టు బిల్డ్ అప్ ఇస్తున్నారని ఎద్దేవా చేసారు. అయితే దీనితో అక్కడ ఉన్న వాళ్ళంతా ముక్కున వేలేసుకున్నారు. అసలు పునాదులే లేకుండా వైఎస్ 90% పనులు పూర్తి చేశారా అని ప్రశ్న రాకమానదు.

దీనిబట్టి అప్పటి జలయజ్ఞం ఎంతటి అవినీతిమయం అయ్యిందో జగన్ చెప్పకనే చెప్పారు. మరోవైపు 187 రోజుల పాటు సాగిన జగన్ పాదయాత్ర ఇప్పటిదాకా 2317. 1 కిలోమీటర్లు పూర్తి అయ్యింది. ఇప్పటికే జగన్ 10 జిల్లాలలో పాదయాత్ర పూర్తి చేసుకున్నారు. ఉత్తరాంధ్ర మాత్రమే మిగిలి ఉంది.

ADVERTISEMENT
Latest Stories