ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒకప్పుడు రాష్ట్రం చాలా క్లిష్టపరిస్థితిలో ఉందని రుణమాఫీ వంటిది కుదరదని చెప్పుకొచ్చేవారు. అయితే ఇప్పుడు అదంతా పక్కన పెట్టి అధికారంలోకి రావడమే పరమావధిగా తాయిలాలు ప్రకటిస్తూ పోతున్నారు. .ఇంతకుముందు ఐదు ఎకరాల లోపు ఉన్న రైతులకే తాము అదికారంలోకి వస్తే పెట్టుబడి నిది కింద ఏడాదికి 12500 రూపాయలు ఇస్తామని ప్రకటించారు.
కాని ఇప్పుడు రైతులందరికి ఆ స్కీమ్ వర్తింప చేస్తామని ఆయన చెప్పారు. 5 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకే వైఎస్సార్ రైతు భరోసా పథకాన్ని వర్తింపజేయాలని మొదట్లో భావించినప్పటికీ క్షేత్ర స్థాయి పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ఎవరికి ఎంత భూమి ఉందనే దాంతో నిమిత్తం లేకుండా రాష్ట్రంలోని ప్రతి రైతుకూ పెట్టుబడి కింద ఈ మొత్తాన్ని ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిపారు.
దీనిబట్టి ప్రతి రైతుకు 62500 ముడతాయి అన్నమాట ఐదు సంవత్సరాలలో. చంద్రబాబు రుణమాఫీకి కుటుంబం మొత్తాన్ని ఒక యూనిట్ గా తీసుకోగా జగన్ ప్రతి రైతుకు అంటున్నాడు కాబట్టి ఇది రుణమాఫీకంటే పెద్ద స్కీంలా రూపు చెందబోతుంది. జగన్ ఎప్పుడు చంద్రబాబు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి గెంటాడు అంటూ ఉంటారు అదే నిజమైతే వరుసగా ప్రకటిస్తున్న ఇలాంటి స్కీంలు ఎలా ఇస్తారు? చంద్రబాబు రాష్ట్ర ఆదాయం అంతగా పెంచారా? ఒకవేళ పెంచితే జగన్ పనేముంది ఇంకా రాష్ట్రానికి?



