ఆంధ్రప్రదేశ్ లో గ్రామ, వార్డు వాలంటీర్లు, అలాగే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు జగన్ ప్రభుత్వం ఏరికోరి నియమించుకుంది. వీరంతా జగన్ మనుషులని ప్రజలు, ప్రతిపక్షాలు అనుకున్నారు. వారు కూడా మేము జగన్ మనుషులమే అన్నట్టు పనిచేశారు.
ఇప్పటికే వాలంటీర్లు అరకొర జీతాలు, బండెడు చాకిరి కారణంగా అసహనంగా ఉన్నారు. తాజాగా సచివాలయ ఉద్యోగులు జగన్ ప్రభుత్వం పై ఆగ్రహంగా ఉన్నారు. అందుకు కారణం ప్రభుత్వ నిర్వాకమే.
మొన్నటివరకు వీళ్ళ ను చూసీ చూడనట్టు వదిలేసిన ప్రభుత్వం.. ఇప్పుడు ఉన్నఫళంగా బయోమెట్రిక్ హాజరు లేదని అక్టోబరు జీతంలో కొందరికి 10%, మరికొందరికి 50% వరకు తగ్గించారు. దీనితో వారంతా ఉన్నత అధికారుల వద్ద ఇదెక్కడి అన్యాయం అని వాపుతున్నారు.
తమలో చాలా మంది ఫీల్డ్ జాబ్లలో ఉంటారని, రోజు సచివాలయాలకు వచ్చి బయోమెట్రిక్ హాజరు వెయ్యరు. ఆ సమస్యకు పరిష్కారం చూపకుండా జీతాలు కట్ చెయ్యడం ఏంటని ఫైర్ అవుతున్నారు. కొన్ని చోట్ల బయోమెట్రిక్ ఆన్‌లైన్ విధానం సరిగా పనిచేయక పోవడం, కొన్నిచోట్ల డివైజ్‌లు అందుబాటులో లేక హాజరు కనబడటం లేదు.
అయినా పనిష్మెంట్ మాత్రం ఉద్యోగులకే… ఇప్పటికే అరకొర జీతాలు… అవి కూడా టైం కి రాక ఇబ్బంది పడుతున్న తాము… ఇలా జీతాలు కట్ చేస్తే ఎలా బ్రతకగలం అని వారు వాపోతున్నారు. అయితే ఆర్ధిక భారం తగ్గించుకోవడం కోసమే ప్రభుత్వం ఇలా చేస్తుందని కూడా వారు ఆరోపిస్తున్నారు. జగన్ ని నెత్తిన మోసి… ఇప్పుడు తిప్పలు పడుతున్నాం అని వారు వాపోతున్నారు.



