జగన్ స్వీయ దర్శకత్వంలో “బూతుబలి”

YS jagan insists party leaders to abuse chandrababu naidu‘వంకర బుద్ధి ఎక్కడో చోట ఖచ్చితంగా బయటపడి తీరుతుంది’ అంటారు పెద్దలు. వైసీపీ ప్లీనరీ వేదికలో జరిగింది కూడా అదే. ‘తాను తీసుకున్న గోతిలో తానే పడ్డాడు’ అన్న చందంగా… కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రెండు రోజుల పాటు అట్టహాసంగా జరిపిన పార్టీ ప్లీనరీ సమావేశాలలో చివరగా తేలిన అంశం ఏమిటంటే… ‘జగన్ వంకర బుద్ధి’ అన్న విషయం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న వీడియో చెప్పకనే చెప్తోంది.

ADVERTISEMENT

చంద్రబాబును తిట్టమంటూ వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన ఆదేశాలను ఉమారెడ్డి వెంకటేశ్వర్లు ద్వారా రోజాకు తెలియజేసిన వీడియోపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. విమర్శలెప్పుడూ నిర్మాణాత్మక ధోరణిలో ఉండాలి గానీ, వ్యక్తిగత ధోరణిలో కాదన్నది రాజకీయ విశ్లేషకులు ఎప్పుడ్ చెప్పే అంశం. కానీ వ్యక్తిగత కక్ష్యలను దృష్టిలో పెట్టుకుని జగన్ ఈ పనులు చేస్తున్నారన్న విషయం రాష్ట్ర ప్రజలకు తేటతెల్లం అయినట్లయ్యింది.

ఒక రకంగా చెప్పాలంటే… జగన్ తన స్వీయ నిర్మాణ దర్శకత్వ పర్యవేక్షణలో వైసీపీ పార్టీని ఒక “బూతుబలి”గా తయారు చేస్తున్నారని నెటిజన్లు వేస్తున్న కౌంటర్లకు కొదవలేదు. ఇందులో రోజాను ఒక పావులా వాడుకుంటున్నారని, ఆవేశం తప్ప ఆలోచనల్లో పరిపక్వత ప్రదర్శించలేని రోజా, ఇందుకు బలిపశువు అవుతున్నారని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.

రాజమౌళి ‘బాహుబలి’ ప్రేక్షకుల ఆదరణ పొందడానికి కాస్త సమయం తీసుకుంది గానీ, జగన్ ‘బూతుబలి’ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడానికి పెద్ద సమయం తీసుకోలేదు. ‘బాహుబలి’ మాదిరే ‘బూతుబలి’కి కూడా నెటిజన్లు పట్టం కట్టడంతో… జగన్ బండారం బట్టబయలై అందరికీ తెలిసి వచ్చింది. అంటే తమ పార్టీ నేతల చేత జగనే దగ్గరుండి తిట్టిస్తారన్న విషయం ఈ సందర్భంగా స్పష్టమైంది.

ADVERTISEMENT
Latest Stories