మంత్రినని మరిచిపోయారు… ఇప్పుడు గుర్తుచేసుకు బాధపడుతున్నారు!

Gudivada Amarnath

వైసీపి అధినేత జగన్మోహన్‌ రెడ్డి రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణలో తననే నమ్ముకున్న వైసీపి నేతలను, కార్యకర్తలను నడిరోడ్డున విడిచిపెట్టి ఆంధ్రాకు వచ్చేశారు. అధికారంలోకి వచ్చాక తల్లి విజయమ్మని, అంతకు ముందే చెల్లి వైఎస్ షర్మిలని బయటకు పంపించేశారు.

ADVERTISEMENT

రెండేళ్ళ తర్వాత పలువురు మంత్రులను పదవులలో నుంచి తప్పించేశారు. చివరాఖరుగా ఎన్నికలు దగ్గర పడిన తర్వాత సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలను కూడా నిర్ధాక్షిణ్యంగా పక్కన పెట్టేస్తున్నారు. వీటన్నిటికీ జగన్‌ ఏ కారణాలు చెపుతున్నప్పటికీ, తననే నమ్ముకున్నవారికి ‘హ్యాండ్’ ఇస్తారని స్పష్టం అవుతోంది.

అలా హ్యాండ్ ఇచ్చిన వారిలో గుడ్డు మంత్రి గుడివాడ అమర్నాథ్ కూడా ఒకరు. ఆయనకు కీలకమైన పరిశ్రమలు, ఐ‌టి శాఖ మంత్రి పదవి లభించినప్పుడు, దానిని సద్వినియోగించుకొని రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు, ఐ‌టి కంపెనీలు తెచ్చి ఉద్యోగాలు కల్పించి ఉంటే మంచి పేరు వచ్చేది.

మంచి సమర్ధుడని నిరూపించుకొని ఉంటే గుడివాడ అమర్నాథ్ కు నేడు ఇటువంటి దుస్థితి కలిగేదే కాదు. కానీ ఓ మంత్రిగా తన సమర్దత నిరూపించుకోవడం కంటే, అధినేతని ప్రసన్నం చేసుకోవడంపైనే గుడివాడ అమర్నాథ్ ఎక్కువ శ్రద్దపెట్టారు. ఆ ప్రయత్నంలో తాను మంత్రిననే విషయం కూడా ఆయన మరిచిపోయిన్నట్లున్నారు.

గుడివాడ ఎంతగా జగన్‌ భజన చేసినా మళ్ళీ టికెట్‌ ఇవ్వలేదు. అంతేకాదు… విశాఖలో మిలాన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తున్న ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్‌కు స్వాగతం చెప్పే బాధ్యతల నుంచి కూడా తప్పించేయడం, గుడివాడకు జీర్ణించుకోవడం కష్టమే. తనను అధినేత జగన్‌ ఇంతగా అవమానిస్తుండటంతో, బహుశః ఇప్పుడు ఆయనకు తన మంత్రి హోదా తప్పక గుర్తుకు వచ్చే ఉంటుంది.

ఈ అవమానాలు దిగమింగుతూ వైసీపిలో ఉండలేక, బయటకు వెళ్ళలేక బాధపడుతున్నవారు గుడివాడ అమర్నాథ్ ఒక్కరే కాదు. వైసీపిలో ఇంకా చాలా మంది మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలదీ ఇదే పరిస్థితి.

మా నమ్మకం నువ్వే అని భజన చేస్తూ కాలక్షేపం చేయడం జగన్‌ తప్పు కాదు. అలా అనుకున్న వారిదే తప్పు. కనుక దానికి మూల్యం చెల్లించాల్సిందే తప్పదు.

దీనిలో నీతి ఏమిటంటే, అవకాశం వచ్చినప్పుడు తమ సమర్దత నిరూపించుకునే ప్రయత్నం చేయాలి తప్ప అధినేత భజనతో టికెట్లు, పదవులు రావని!

ADVERTISEMENT
Latest Stories