ys-jagan-meeting-with-ysrcp-leaders

వైసీపీ అనుకూల మీడియాలో ఒక్కోసారి కొన్నిరాయలు ఆ పార్టీ గురించి ఆసక్తికరమైన విశ్లేషణలు వస్తుంటాయి. అటువంటిదే ఇదీను. జగన్‌, వైసీపీని చూసి మనమేమీ ఆందోళన చెందాల్సిన అవసరమే లేదని.. వైసీపీ ఎప్పటికీ మళ్ళీ అధికారంలోకి రాదని టీడీపీ నేతలు అనుకుంటున్నారట.

దానికి కారణం జగన్‌ ధోరణి, జగన్‌ ప్రగల్భాలు, బెదిరింపులు, ఆయన చుట్టూ మళ్ళీ చేరిన కోటరీయే ఇందుకు కారణమని టీడీపీ నేతలు నిర్భయంగా ఉన్నారట. ఈ విశ్లేషణ చాలా సహేతుకంగా నే ఉంది కదా?

Also Read – ఊరిస్తూనే…ఉసురుమనిపిస్తుందే..!

జగన్‌ ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత కూడా ఓటమిని అంగీకరించకుండా ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయడం వలననే ఓడిపోయామని, కనుక ఇకపై బ్యాలెట్ ఎన్నికలు నిర్వహించాలని పాట అందుకున్నారు తప్ప తన చిత్రవిచిత్రమైన ధోరణి వల్లనే ఓడిపోయామని నేటికీ ఒప్పుకోవడం లేదు.

ఈవీఎంల వలన ఓడిపోయామని చెప్పుకుంటూనే, 40 శాతం ఓట్లు మనకే పడ్డాయి కనుక నైతికంగా మనమే గెలిచామని జగన్‌ చెప్పుకోవడం అందరూ విన్నారు.

Also Read – నాగబాబు వ్యాఖ్యలు…వర్మకు కౌంటరా.?

అధికారం కోల్పోయి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజకీయ పార్టీల అధినేతలు నిత్యం ప్రజల మద్య ఉంటూ ఏవిదంగా ముందుకు సాగాలో చంద్రబాబు నాయుడు నిరూపించి చూపారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు కూడా నిత్యం ప్రజల మద్యనే ఉంటున్నారు.

కానీ జగన్‌ మాత్రం 6 నెలలు గడిచినా ఇంకా తాడేపల్లి ప్యాలస్‌ వదిలి బయటకు రావడానికి ఇష్టపడటం లేదు. పైగా మీరందరూ పోరాడుతూ ఉండండి. సంక్రాంతి తర్వాత నేనొస్తానని నిసిగ్గుగా చెపుతున్నారు.

Also Read – జగన్‌ గుర్తించలేని మెగాస్టార్‌ని బ్రిటన్ గుర్తించింది!

కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యం అక్రమ రవాణా చేసి అవినీతికి పాల్పడ్డారని ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు, మంత్రులు ఆరోపిస్తూనే ఉన్నా జగన్‌తో సహా వైసీపీ నేతలు ఎవరూ కూడా అవినీతికి పాల్పడలేదని ధైర్యంగా చెప్పలేకపోతున్నారు.

సింగిల్ సింహం, అర్జునుడు అని గొప్పలు చెప్పుకున్న ఉత్తర కుమారుడు కనీసం శాసనసభకు వచ్చి ధైర్యంగా వారిని ఎదుర్కోలేకపోతున్నారు.




175 పాటతో అందరికీ జోల పాడిన జగన్‌, ఇప్పుడు ‘మళ్ళీ మనమే వస్తాం’ అనే కొత్త జోలపాట పాడుతున్నారు. ‘అశ్వధామ హతః కుంజరః‘ అన్నట్లు ‘మళ్ళీ మనమే అంటే..’ దానర్ధం ‘మళ్ళీ మనమే కూటమిని గెలిపిద్దాం’ అనట! కనుక జగన్‌ వంటి అధినేత, ఇటువంటి నాయకులు ప్రత్యర్ధులుగా ఉన్నప్పుడు కూటమి నేతలు వారి గురించి ఆలోచించాల్సిన అవసరం ఏమిటి?