వైసీపీ అధినేత జగన్ కు తృటిలో తప్పిన ప్రమాదం!

ys-jagan-mohan-reddy-accidentఎప్పుడెప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం కూలిపోతుందా… ఎప్పుడెప్పుడు ఆంధ్రప్రదేశ్ కు తానూ ముఖ్యమంత్రి కావాలా… అని ఎదురుచూస్తున్న వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి తృటిలో ప్రమాదం తప్పింది. మంగళవారం నాడు కర్నూలులో జరిగిన ‘యువభేరి’లో పాల్గొని, తిరిగి హైదరాబాద్ వస్తుండగా ఈ అనుకోని ఘటన చోటుచేసుకుంది.

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండల పరిధిలోని పాల్మాకుల వద్దకు చేరుకునే పాటికి జగన్ ప్రయాణిస్తున్న కారు టైరుకు పంక్చర్ అయింది. అప్పటికే వేగంగా వెళ్తున్న కారు ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డు పక్కకు వెళ్లిపోయింది. అయితే డ్రైవర్ వెంటనే అప్రమత్తత కావడంతో కారును వెంటనే నిలుపుదల చేయగలిగాడు. ఈ లోపున భద్రతా సిబ్బంది కాన్వాయ్ నుంచి దిగి జగన్‌కు రక్షణ వలయం ఏర్పాటు చేశారు. కారు టైరు మార్చిన తర్వాత తిరిగి అదే కారులో జగన్ సురక్షితంగా హైదరాబాద్ చేరుకున్నారు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories