విశాఖ రాజధానిగా చేయదమంటే సిఎం జగన్మోహన్ రెడ్డి విశాఖకు మకాం మార్చడమే అని తీర్మానించేసిన వైసీపి, ఆ ముక్క కూడా ధైర్యంగా చెప్పుకోలేక ఉత్తరాంధ్రా జిల్లాల అభివృద్ధి కోసమే సీఎం జగన్ విశాఖ వస్తున్నారని చెప్పుకోవడం చూసి ప్రజలు కూడా నవ్వుకొంటున్నారు.
విశాఖ రాజధాని అని ధైర్యంగా చెప్పుకోలేనప్పుడు వందల కోట్లు ఖర్చు చేసి ఋషికొండని చెక్కేసి దానిపై విలాసవంతమైన భవనాలు నిర్మించుకోవడం దేనికి?వాటిలో దిగడం దేనికి?ఉండవల్లిలో టిడిపి ప్రభుత్వం నిర్మించిన ప్రజావేదిక భవనానికి అనుమతులు లేవని కూల్పించేసిన జగన్, సుప్రీంకోర్టు, హైకోర్టు వద్దని చెపుతున్నా ఋషికొండపై భవనాలు ఎందుకు నిర్మించారు?రేపు వాటిని కూల్చేయాలని సుప్రీంకోర్టు ఆదేశిస్తే ప్రజాధనం వృధా కాదా? దానికి ఎవరు బాధ్యత వహిస్తారు?అని ఉత్తరాంధ్రా జిల్లాల ప్రజలే ప్రశ్నిస్తున్నారు.
జగన్ విశాఖ వచ్చేస్తున్నారంటూ నిద్రలో కలవరించిన్నట్లుగా మాట్లాడే మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా మళ్ళీ సైలంట్ అయిపోయారు. ఎవరూ జగన్ విశాఖ మకాం మార్చడం గురించి మాట్లాడటం లేదిప్పుడు. మిగ్‌జామ్ తుఫానుతో జరిగిన నష్టం, సహాయ చర్యలను పర్యవేక్షించడంలో సిఎం జగన్ బిజీ అయిపోయినందున విశాఖకు మకాం కార్యక్రమాన్ని వాయిదా వేసుకొన్నారని చెపుతారేమో?ఒకవేళ ఇప్పటికే సచివాలయం, ప్రభుత్వ కార్యాలయాలు, అధికారులు, ఉద్యోగులు అందరినీ విశాఖకు తరలించేసి, విశాఖ నుంచే రాష్ట్రాన్ని పాలిస్తున్నట్లయితే అప్పుడు కూడా నెల్లూరు, బాపట్లలో తుఫాను సహాయ చర్యలను పర్యవేక్షించాల్సిందేగా? అప్పుడు ఏం చేసేవారో?ఎలాగూ కొత్తగా రాజధాని నిర్మించుకొనే అవకాశం ఉన్నప్పుడు దానిని రాష్ట్రానికి మద్యలో నిర్మించుకొంటే అన్ని జిల్లాలకు అందుబాటులో ఉంటుందని చంద్రబాబు నాయుడు ఆలోచన రాష్ట్రాన్ని ఏలుతున్నవారికి ఇప్పటికైనా అర్దమైందో లేదో?






