దళితుల మీద ప్రేమను బస్సులో దాచారా జగన్!

YS Jagan Meetingపొద్దున్న లేస్తే నా ఎస్సి,నా ఎస్టీ,నా బీసీ అంటూ చిలక పలుకులు పలికే ముఖ్యమంత్రి జగన్ ఆయనకు దళితుల మీద ఎంత ప్రేమ ఉందో ఈరోజు కాకినాడ జిల్లా సామర్లకోటలో సభ ద్వారా నిరూపించుకున్నారు. ప్రభుత్వం నిర్మించిన పేదల ఇళ్ల సామూహిక గృహప్రవేశానికి బటన్ నొక్కడానికి వచ్చిన జగన్ తానూ పలికే చిలక పలుకులను వాస్తవంలో ఎంతవరకు పాఠిస్తారో ప్రజలకు కళ్లారా చూపించారు.

కాకినాడ వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు గుర్తున్నాడుగా..,అదే అండి ఒక వ్యక్తిని చంపి శవాన్ని డోర్ డెలివరీ చేసి ఇప్పుడు బెయిలు మీద తిరుగుతున్నాడుగా అతనే. దళితుల మీద వల్లమాలిన ప్రేమ కురిపించే జగన్ ఒక పేద దళిత వ్యక్తిని చంపి ఆకుటుంబాన్ని రోడ్డు మీదకు తీసుకువచ్చిన అనంతబాబు సాక్ష్యాత్తు సీఎం జగన్ కాన్వాయి నుండి బయటకు రావడం కెమెరా కళ్ళకు చిక్కింది. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

ADVERTISEMENT

హత్య చేసాడని ఆరోపణలు ఎదుర్కోవడం కాదు తానే ఆ హత్య చేసాను అంటూ న్యాయస్థానాల ముందు ఒప్పుకున్న అనంతబాబుని జగన్ వెంటేసుకొచ్చి విలువలు, విశ్వసనీయత, నీతి, నిజాయితీ అంటూ పెద్దపెద్ద పదాలను చెప్పడం ద్వారా సమాజానికి ఎం మెసేజ్ ఇద్దామనుకున్నారో మరి.

ప్రతిపక్ష నేతలు తనను చిన్న మాట అంటేనే తన సైన్యాన్ని పార్టీ కార్యాలయాల మీద దాడులకు పంపి రాష్ట్రాన్ని రవాణా కాష్ఠంగా మార్చే జగన్ ఒక వ్యక్తిని చంపిన నేరస్తుకి రాజకీయ అవకాశం కలిపిస్తున్నారు అంటేనే తెలుస్తుంది జగన్ చేప్పేవే శీరంగ నీతులు చేసేవి హత్య రాజకీయాలే అనేది.

చంద్రబాబు మీద ఆరోపణలు వస్తేనే ఆయన ప్రజల సొమ్ముని కాజేసిన దొంగా అంటూ విరుచుకుపడే జగన్ అండ్ కో నేరాన్ని ఒప్పుకున్న ఒక హంతకుడికి పార్టీలో పదవి కట్టబెట్టి చేసే రాజకీయాలను ఏమనాలో? పవన్ ఒక ప్యాకేజీ స్టార్ అంటూ ప్రతిపక్షములో ఉన్నప్పుడు అందుకున్న స్టోరీ తానూ అధికార పక్షంలోకి వచ్చినప్పటికీ వాటికీ ఆధారాలు చూపలేని పరిస్థితి.

ఆధారాలు లేకపోయినా ప్రతిపక్ష నేతల మీద నిందలు వేస్తే ప్రజలు వాటిని నమ్మాలి.కానీ ఆధారాలతో అడ్డంగా దొరికి పోయినా వైసీపీ హంతకులను మాత్రం ప్రజలు నెత్తినపెట్టుకోవాలా? ఈ ఒక్కరితోనే దళితులపై వైసీపీ దాడులు ఆగిపోలేదు.కరోనా సమయంలో మాస్కులు లేవని ప్రభుత్వాన్ని ప్రశ్నించిన డాక్టర్ సుధాకర్ ఒక దళిత వ్యక్తే. వైసీపీ దాష్టికానికి సమాజం ముందు పిచ్చివాడిగా ముద్రవేయించుకుని ఆత్మ హత్య చేసుకున్న నిస్సహాయుడిగా మిగిలిపోయాడు.

సొంత బాబాయిని హత్య చేస్తేనే న్యాయానికి దిక్కులేని పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొంది అంటూ సాక్షాత్తు వివేకా కూతురే జగన్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దుస్థితికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచాయి. దళితులకు ఉన్నత చదువులకై గత ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన అంబేద్కర్ విదేశీ విద్యా పథకానికి పేరు మార్చి జగనన్న విదేశీ విద్య అంటూ రాజ్యాంగ పితామహుడు,దళితులు దేవుడిగా భావించే అంబేద్కర్ కే రాష్ట్రంలో విలువలేదు అన్నట్లుగా ప్రభుత్వ నిర్ణయాలు ఉంటున్నాయి.

ఎస్టీ, ఎస్సి నిధులు దారి మళ్లించి దళితుల పై దొంగ ప్రేమ నటించేది ఎవరో ఒక్కసారి సోదరులు ఆలోచించాలి. అప్పుడే ఇలా హత్యలు చేసిన నేరస్తులను ముఖ్యమంత్రి కాన్వాయి బస్సులో కాకుండా కటకటాల వెనుక చూడగలం.

ADVERTISEMENT
Latest Stories