జగన్ ను కుర్చీ ఎక్కించే భారం వెంకన్న సామీదే!

ys Jagan tirumala tirupati visitఒకప్పుడు చెప్పులతో తిరుమల క్యూ లైన్లో ప్రవేశించి జగన్ మోహన్ రెడ్డి సంచలనం సృష్టించారు. అన్యమతస్తులు సంతకం చెయ్యాల్సిన రిజిస్టర్లో సంతకం చెయ్యడానికి కూడా ఆయన నిరాకరించారు. శిలువ వేసుకుని పుష్కరాల స్నానం చేసి, చేతిలో బైబల్తో ప్రచారం చేసిన ఆది జగన్ కుటుంబానికే చెల్లు.

ఐతే దీనివల్ల హిందువుల ఓట్లు పోగొట్టుకున్నాం అని జగన్ భావన అందుకే ఈ మధ్య స్వామీజీల చుట్టూ చక్కర్లు కొట్టి ఆ ముద్రపొగ్గోటుకునే ప్రయత్నం చేస్తున్నారు ఆయన. త్వరలో మొదలు పెట్టబోయే పాదయాత్రకు కూడా హిందూ టచ్ ఇవ్వబోతున్నారు జగన్ మోహన్ రెడ్డి.

ADVERTISEMENT

పాదయాత్రకు ముందుగా 4న శనివారం తిరుమలేశుని దర్శించుకుంటారు. వెంకటేశ్వరస్వామికి శనివారం ప్రత్యేకం కాబట్టి ఆ రోజే దర్శనం చేసుకోవాలని జగన్‌ నిర్ణయించినట్లు సమాచారం. అలాగే ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకూ పాదయాత్ర నిర్వహించాక విపక్ష నేత మరోసారి తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు.

చివరగా కాలినడకన ఏడు కొండలు ఎక్కి తిరుమలేశుని దర్శించుకోవడంతో పాదయాత్ర ముగుస్తుందని పార్టీ వర్గాలు తెలిపాయి. మొత్తానికి 2019లో మాత్రం తనను ఎక్కించే భారం వెంకన్న సామి మీదే వేసినట్టు కనిపిస్తుంది. ఐతే చిత్తశుద్ది లేని శివపూజలు ఫలించవు అంటారు మరి జగన్ చిత్తశుద్ది తోనే ఈ భక్తి మార్గం ఎంచుకున్నారా? ఏమో!

ADVERTISEMENT
Latest Stories