ఎప్పటిలానే జగన్ మోహన్ రెడ్డి తిరుమల టూర్ వివాదాలకు కేంద్ర బిందువు అయింది. హిందూ సంప్రదాయాలను గౌరవిస్తానంటూ డిక్లరేషన్‌పై సంతకం చేయాలని తితిదే వసతి కల్పన విభాగం అధికారులు కోరగా వారిని జగన్ గదమాయించారు. జగన్‌తో పాటు వచ్చిన ఓ మహిళా నేత పాదరక్షలతో వైకుంఠంలోకి ప్రవేశించబోయారు. భద్రతా సిబ్బంది గుర్తుచేయడంతో పక్కన వదిలిపెట్టారు.
ఆమె ఒక క్రైస్తవ మతస్తురాలని సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు రుజువు చేస్తున్నాయి. తిరుగు ప్రయాణమవుతున్న సమయంలో జగన్ ప్రైవేటు రక్షణ సిబ్బంది వాహనాల హారన్లు మోగిస్తూ హడావుడి చేశారు. శారదా పీఠానికి వెళ్లే సమయంలో అక్కడక్కడ ‘జగనన్న జిందాబాద్’ అంటూ అనుచరులు నినదించారు. దీనిపై భక్తుల నుంచి విమర్శలు వచ్చాయి.
అయితే దేవుడి దృష్టిలో భక్తులందరూ సమానమేనని, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ విషయంలో గుర్తుకురాని డిక్లరేషన్.. జగన్ విషయంలో తితిదేకు ఎందుకు గుర్తొస్తుందో అర్థం కావడం లేదని వైకాపా అధికార ప్రతినిధి భూమన కరుణాకర్‌రెడ్డి వాదించారు. గతంలో టీటీడీ చైర్మన్ గా పని చేసిన ఆయనకు దేవస్థానం రూల్స్ తెలియకపోవడం విచారం.
హిందూ సంప్రదాయాలను గౌరవిస్తానంటూ డిక్లరేషన్‌పై సంతకం చెయ్యకపోవడం వాళ్ళ నిజంగా ఆయనకు దేవుడి మీద నమ్మకం లేదా అనే ప్రశ్న వస్తుంది. ఇప్పటిదాకా హిందువులను ఆకట్టుకోవడానికి ఆయన చేసిన ప్రయత్నాలన్నీ వృధా అయినట్టే. తిరుమల వస్తే ఈ సమస్య వస్తాది అని అందరు ఊహించినదే అయితే దానికి తగ్గ ఏర్పాట్లు చేసుకోకపోవడం ఖచ్చితంగా ఆ పార్టీ లోపమే.
జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 26 సార్లు స్వామిని దర్శించుకున్నారని భూమన చెప్పుకొచ్చారు. అయితే అప్పుడు భూమన టీటీడీ చైర్మన్ గా ఉండి, వైఎస్ ముఖ్యమంత్రి గా ఉంది వ్యవస్థలను ఎలా నిర్వీర్యం చేసారో ఇంతకంటే చెప్పేది ఏముందని టీడీపీ నాయకులు అంటున్నారు. ఈ వివాదాన్ని మరింతగా కవర్ చెయ్యాలని చూస్తే అది ఆ పార్టీ కే నష్టం.





