వేసవి సెలవులు పూర్తి కావడంతో మళ్ళీ కోర్టు ముందుకు జగన్

YS Jagan to attend court on Fridayవేసవి సెలవుల కారణంగా దాదాపుగా ఒక నెల పాటు కోర్టుకు వెళ్ళని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈరోజు నాంపల్లి సీబీఐ కోర్టు ముందు హాజరయ్యారు. జగన్‌తో పాటు రాజ్యసభ సభ్యుడు విజయ్ సాయిరెడ్డి, మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి కూడా విచారణకు హాజరయ్యారు. సీబీఐ, ఈడీ దాఖలు చేసిన అభియోగ పత్రాలపై ఈరోజు విచారణ జరిగింది.

ADVERTISEMENT

కోర్టు వాయిదా ఉండటంతో నిన్న మధ్యాహ్నం పాదయాత్ర ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు. తొలుత తిరుమల మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులుతో సమావేశం అయ్యి తరువాత కొందరు పార్టీ నాయకులతో కూడా మాట్లాడారు. రేపు తిరిగి పాదయాత్ర కొనసాగించబోతున్నారు. ఇక నుండి మళ్ళీ ప్రతి వారం కోర్టుకు హాజరు కావాల్సి ఉంది.

ఈరోజు జగన్ తో పాటు ఓబుళాపురం మైనింగ్ కంపెనీ అక్రమాల కేసులో గాలి జనార్దన్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, శ్రీలక్ష్మి కోర్టుకు హాజరయ్యారు. ఓఎంసీ కేసు విచారణ ఈ నెల 30వ తేదీకి వాయిదా పడింది. జగన్ పాదయాత్ర ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో సాగుతుంది. ఇప్పటిదాకా ఆయన 2271.6 కిలోమీటర్లు నడిచినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.

ADVERTISEMENT
Latest Stories