జగన్ పాదయాత్ర అప్పుడు పూర్తి కాబోతుందా?

ys-jagan-to-end-padayatra-after-visiting-tirumala-tirupatiవైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంకల్పయాత్ర వచ్చే నెల 8, లేదా 9వ తేదీ నాటికి ముగిసే అవకాశాలున్నాయన్నారు. ప్రతిపక్ష నేత హోదాలో దివంగత వైఎస్సార్‌ ఇచ్ఛాపురంలో ప్రజా ప్రస్థానాన్ని ముగించిన తరహాలోనే.. వైఎస్‌ జగన్‌ ప్రజా సంకల్ప యాత్రను కూడా ఇచ్ఛాపురం బహిరంగ సభతో ముగిస్తారని చెప్పారు. అదే రోజు వైఎస్‌ జగన్‌ తిరుపతికి చేరుకుని విశ్రాంతి తీసుకుంటారని, ఆ మర్నాడు ఉదయమే అతిథి గృహం నుంచి కారులో బయలుదేరి అలిపిరికి చేరుకుంటారని సమాచారం.

ADVERTISEMENT

[m9ad]

శ్రీవారి మెట్టుదారిన తిరుమలకు నడిచి వెళ్లి, శ్రీవారిని దర్శించుకుని, మొక్కులు చెల్లించుకుంటారు. వైఎస్‌ జగన్‌ సుమారు 140 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా 3,600 కిలోమీటర్ల మేరకు పాదయాత్రను కొనసాగించారు. సుమారు 2.70 కోట్ల మంది ప్రజలను వైఎస్‌ జగన్‌ ప్రత్యక్షంగా కలుసుకున్నారని వైకాపా వర్గాల అంచనా. దివంగత వైఎస్సాఆర్, ఆ తరువాత చంద్రబాబు నాయుడు ఇద్దరూ పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చారు. దీనితో ఈ పాదయాత్రపై జగన్, ఆయన పార్టీ వర్గాలు భారీ ఆశలే పెట్టుకున్నారు.

గత సంవత్సరం పాదయాత్ర ప్రారంభించే ముందు కూడా జగన్ తిరుమల దర్శనం చేసుకున్నారు. పాదయాత్ర చేరని నియోజకవర్గాలలో బస్సు యాత్ర చెయ్యాలని మొదట సంకల్పించినా పాదయాత్ర బాగా ఆలస్యం కావడంతో ఆ ప్రతిపాదన విరమించుకున్నట్టు సమాచారం. ఎన్నికలకు ఐదు నెలలే సమయం ఉండటంతో అభ్యర్థులు ఫైనల్ చేయ్యడంలో ఆయన కొన్ని రోజులు బిజీగా ఉండబోతున్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగానే మలి విడత ప్రచారం మొదలు పెడతారు.

ADVERTISEMENT
Latest Stories