పాదయాత్ర పునః ప్రారంభించబోతున్న జగన్

YS Jagan to restart praja Sankalpa yatraకోడి కత్తి దాడిలో గాయపడి విశ్రాంతి తీసుకుంటున్న ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వచ్చేనెల 3 నుంచి వైకాపా అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ ప్రజాసంకల్ప యాత్ర పునః ప్రారంభించబోతున్నారు. సాలూరు నియోజకవర్గం మక్కువ మండలంలో పాదయాత్ర పూర్తి చేసుకొని 4న పార్వతీపురం నియోజకవర్గం సీతానగరం మండలం బగ్గందొరవలసలో ప్రారంభమవుతుంది.

ADVERTISEMENT

[m9ad]

6న పార్వతీపురంలో బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. మరోవైపు జగన్ ఆంధ్రప్రదేశ్ పోలీసులకు ఈ కేసు విషయంలో సహకరించకుండా కేంద్రానికి ఫిర్యాదు చేసారు. మరో వైపు ఈ కేసులో విచారణను వేగవంతం చేసింది జగన్‌పై హత్యాయత్నానికి పాల్పడిన శ్రీనివాసరావుకు చెందిన ఓ బ్యాంకు ఖాతాలో రూ.40 వేలను ఓ వ్యక్తి జమ చేశాడని పోలీసుల దృష్టికి వచ్చింది.

ఆ మొత్తాన్ని శ్రీనివాసరావు డ్రా చేసినట్టు కూడా గుర్తించారు. నగదు వేసిన వ్యక్తి ఎవరు? ఎందుకు వేశారన్న అంశంపై పోలీసులు దృష్టి సారించారు. శ్రీనివాసరావు నుంచి స్వాధీనం చేసుకున్న సెల్‌ఫోన్లు, కాల్‌డేటా పరిశీలనలో వైకాపా కార్యాలయంలో విధులు నిర్వర్తించే ‘కె.కె.’ అనే వ్యక్తితోనూ ఎక్కువసార్లు మాట్లాడినట్లు తేలడంతో పోలీసులు అతన్ని విచారించారు.

ADVERTISEMENT
Latest Stories