కోడి కత్తి దాడిని వీలైనంతగా ఎక్కువ చేసి చూపి సింపతీ కోసం ప్రయత్నం చేస్తున్నారు ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. తనపై జరిగిన హత్యాయత్నం ఘటనపై రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో లేని విచారణ సంస్థతో దర్యాప్తు జరిపేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఇప్పటికే హై కోర్టులో పిటీషన్ వేసిన జగన్ తాజాగా గవర్నర్ కు కూడా లేఖ రాశారు.
[m9ad]
తనపై జరిగిన ఈ భీకరమైన హత్యాయత్యాన్ని ముఖ్యమంత్రి, డీజీపీ తక్కువ చేసి మాట్లాడటంతో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సంస్థల దర్యాప్తుపై అనుమానాలు రేకెత్తుతున్నాయని తెలిపారు. దర్యాప్తు నిష్పాక్షికంగా, పారదర్శకంగా జరగాలంటే అది రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోని సంస్థలతో సాధ్యం కాదన్నారు. మెరుపు వేగంతో పదునైన ఆయుధంతో నా గొంతు కోయాలని ప్రయత్నించాడని జగన్ ఆరోపించారు.
ఈ దిగ్భ్రాంతికరమైన హత్యాయత్యాన్ని చాలా చిన్నదిగా తగ్గించి చూపే యత్నం చేసి నేను ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉండగానే ఇదంతా ఒక పథకం ప్రకారం అంతర్గతంగా రూపొందించుకున్నదని, ఎన్నికల్లో సానుభూతి కోసమేనని అధికారులు, టీడీపీ నేతలు ప్రజలను నమ్మబలికారు అని జగన్ ఆరోపించారు. అయితే ఈ కేసులో ఇప్పటికే అత్యుత్సాహం చూపించారని గవర్నర్ మీద కూడా అభియోగాలు ఉన్నాయి. దీనితో ఆయన ఎంత మేరకు దీనిపై స్పందిస్తారో చూడాలి.



