పండుగల సీజన్‌కి కొత్త సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. అప్పుడు రిలీజ్ చేస్తే సినిమాలు తప్పకుండా హిట్ అవుతాయని సెంటిమెంట్ ఉంది. ఒకవేళ సినిమా యావరేజ్‌గా ఉన్నా జనాలు పండుగ మూడ్‌లో ఉంటారు కనుక కలెక్షన్లు బాగుంటే ఒడ్డున పడతామని నిర్మాతలు ఆశపడుతుంటారు.
వైసీపి అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా గత నెల రోజుల నుంచి ఇదే పనిలో ఉన్నారు. క్రిస్మస్, న్యూ ఇయర్‌కు రెండు జాబితాలు రిలీజ్ చేసారు. సంక్రాంతి పండుగకి మూడో జాబితా కూడా రిలీజ్ చేశారు.
పదిరోజులుగా తాడేపల్లి ప్యాలస్‌లో చాలా కసరత్తు చేసి ఆరుగురు ఎంపీ, 15 ఎమ్మెల్యే స్థానాలకు అభ్యర్ధులను ఖరారు చేసి జాబితాని గురువారం రాత్రి రిలీజ్ చేశారు.
మరి సంక్రాంతి వైసీపి రిలీజ్‌లో ఎంతమంది హిట్ అవుతారో ఇప్పుడే చెప్పలేము కానీ ట్రైన్ ఆగకముందే దిగిపోయేందుకు తొందరపడే ప్రయాణికుల్లా వైసీపి ట్రైన్‌లో నుంచి మరి కొంతమంది దిగిపోవడం ఖాయమే.
ఎంపీ స్థానాలకు నియమితులైన వైసీపి అభ్యర్ధులు:
· విజయవాడ: కేశినేని నాని
· ఏలూరు: కారుమూరు సునీల్ కుమార్
· విశాఖపట్నం: బొత్స ఝాన్సీ
· శ్రీకాకుళం: పెరాడ తిలక్
· తిరుపతి: కోనేటి ఆదిమూలం
· కర్నూలు: గుమ్మనూరు జయరాం
శాసనసభ స్థానాలకు ఖరారైన అభ్యర్ధులు
· టెక్కలి: దువ్వాడ శ్రీనివాస్
· ఇచ్చాపురం: పిరియ విజయ
· చిత్తూరు: విజయానంద రెడ్డి
· మదనపల్లె: నిస్సార్ అహ్మద్
· రాజంపేట: ఆకెపాటి అమర్నాధ్ రెడ్డి
· పెనమలూరు: జోగి రమేష్
· పెడన: ఉప్పాల రాము
· రాయదుర్గం: మెట్టు గోవింద రెడ్డి
· పూతలపట్టు (ఎస్సీ): మూతిరేవుల సునీల్ కుమార్
· కోడుమూరు (ఎస్సీ): డాక్టర్ సతీష్
· సత్యవేడు (ఎస్సీ): మద్దిల గురుమూర్తి
· చింతలపూడి (ఎస్సీ): కంభం విజయరాజు
· దర్శి: బూచేపల్లి శివ ప్రసాదరెడ్డి
· ఆలూరు: బూసినే విరుపాక్షి.




