రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలోనే ఉన్నారు. రాష్ట్ర విభజనతో దెబ్బ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చాలా వరకు గాడిన పెట్టారు కూడా. ఆ తర్వాత ఎన్నికలలో ఓడిపోయినప్పటికీ ప్రజల తరపున జగన్ ప్రభుత్వంతో అవిశ్రాంతంగా పోరాడుతూనే ఉన్నారు.
జగన్ రాజకీయకక్షకు బలై జైలుకి వెళ్ళివచ్చారు కూడా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించేస్తున్న వైసీపిని ఈసారి ఎన్నికలలో ఓడించి జగన్మోహన్ రెడ్డిని గద్దె దించాలని చాలా పట్టుదలగా ఉన్నారు. ఈ ప్రయత్నంలోనే జనసేన, బీజేపీలతో పొత్తు పెట్టుకుని ఎన్నికల యుద్ధానికి సిద్దం అవుతున్నారు. ఇవన్నీ ప్రజలందరికీ తెలిసిన విషయాలే.
కానీ హటాత్తుగా రాష్ట్రంలోకి ఊడిపడిన వైఎస్ షర్మిల, చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి ఏమి చేశారు? చంద్రబాబు నాయుడు ఊసరవెల్లిలా రంగులు మార్చుతూ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వనని చెపుతున్న బీజేపీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారు?
ఆయనతో పాటు పవన్ కళ్యాణ్ కూడా బీజేపీ చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు?మా జగనన్నతో సహా అందరూ బీజేపీకి ఎందుకు తొత్తులుగా పనిచేస్తున్నారు? ఆ అవసరం ఏమిటి?” అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.
ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఈ ఆఫర్ ఇవ్వకపోయి ఉంటే వైఎస్ షర్మిల నేటికీ తెలంగాణలోనే తిరుగుతుండేవారు. అప్పుడు తెలంగాణ రాజకీయాలు, అక్కడి ప్రజల సమస్యల గురించి మాత్రమే మాట్లాడుతుండేవారు.
కానీ తెలంగాణలో దిక్కుతోచని స్థితిలో ఉన్న వైఎస్ షర్మిల తంతే బూరెల గంపలో పడిన్నట్లు, వచ్చి ఏపీలో పడ్డారు.
కానీ ఏపీ ప్రజలు కాంగ్రెస్ పార్టీని క్షమించరని ముందే తెలుసు కనుక రాని ప్రత్యేక హోదా అంశాన్ని భుజానికి ఎత్తుకొని ప్రజలను మభ్యపెడుతూ ఏపీలో తిరుగుతున్నారు. కాంగ్రెస్ నీడలో ఆమె తన రాజకీయ భవిష్యత్ చక్కదిద్దుకోవాలని ప్రయత్నిస్తున్నారు తప్ప ఏపీ రాష్ట్రాన్ని, ప్రజలను ఉద్దరించడానికి రాలేదని అందరికీ తెలుసు.
కనుక ఈ ఎన్నికల తర్వాత ఆమె ఏ రాజ్యసభ టికెట్టో సంపాదించుకోవడం ఖాయమే. బహుశః అటువంటి షరతుతోనే ఏపీకి వచ్చి ఉండొచ్చు. ఈ ఎన్నికలలో వైసీపి ఓడిపోతే మళ్ళీ ఆమె జగనన్నతో చేతులు కలిపినా ఆశ్చర్యం లేదు.
ఈవిదంగా ఏ ఎండకు ఆ గొడుగు పట్టే అవకాశవాద రాజకీయ నాయకురాలు తన జీవితాన్ని ఏపీకి అంకితం చేసిన చంద్రబాబు నాయుడుని వేలెత్తి చూపే అర్హత కూడా లేదు. చంద్రబాబు నాయుడు ఊసరవెల్లి అయితే మరి ఆమె ఎవరు?





