జగనన్న మానసిక పరిస్థితిపై అనుమానంగా ఉంది: షర్మిల

YS Sharmila

ఓ కుక్కని చంపాలనుకుంటే దానిపై పిచ్చికుక్క ముద్రవేసి చంపిన్నట్లుగా, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఎవరైనా జగన్మోహన్‌ రెడ్డికి, ఆయన పార్టీకి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే, వారిపై టిడిపి, ఎల్లో ముద్ర వేసేసి, చంద్రబాబు నాయుడే వారిని ప్రోత్సహిస్తున్నారంటూ జగన్‌ బ్యాచ్ ప్రచారం మొదలు పెట్టేస్తుంది.

వైఎస్ షర్మిల కాంగ్రెస్ పగ్గాలు చేపట్టి ఆంధ్రాలో అడుగుపెట్టగానే తన అన్న జగన్మోహన్‌ రెడ్డిపై యుద్ధం ప్రకటించారు. ఆమె కడప నుంచి లోక్‌సభకు పోటీకి దిగిన తర్వాత వివేక హత్య గురించి జగనన్నను, అవినాష్ రెడ్డిని గట్టిగా నిలదీయడం మొదలుపెట్టారు.

ADVERTISEMENT

అంతే కాదు… హత్యా రాజకీయాలు చేస్తూ, హత్యారోపణలు ఎదుర్కొంటున్నవారిని వెనకేసుకు వస్తున్న జగన్మోహన్‌ రెడ్డి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి వారసుడు ఎలా అవుతారు? న్యాయం కోసం సొంత అన్నతో కూడా పోరాడేందుకు వెనకాదని నేనే అసలు సిసలు వారసురాలినని వైఎస్ షర్మిల గట్టిగా వాదిస్తున్నారు.

ఆమె వాదనలు కడప ప్రజలతో పాటు యావత్ రాష్ట్ర ప్రజలను కూడా ఆలోచింపజేస్తున్నాయి. వైఎస్ వారసత్వమే వైసీపిని ప్రజలు ఆదరించేలా చేసింది. వైఎస్ వారసత్వమే జగన్మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి అర్హుడుగా చేసింది. కానీ ఇప్పుడు చెల్లి వైఎస్ షర్మిల వచ్చి ఆ వారసత్వ పునాదినే కదిలించేస్తుంటే జగన్మోహన్‌ రెడ్డి ఉపేక్షించలేరు కనుక ఆమెపై కూడా విరుచుకు పడ్డారు.

ఆమెను చంద్రబాబు నాయుడే వెనకుండి ప్రోత్సహిస్తున్నారని, ఆమె తనపై కోపంతో చంద్రబాబు నాయుడుతో చేతులు కలిపి పెద్ద తప్పు చేస్తున్నారని జగన్‌ ఆరోపించారు.

జగన్‌ చేసిన ఈ ఆరోపణపై ఆమె అంతే ఘాటుగా స్పందించారు. “అసలు నేను చంద్రబాబు నాయుడుతో చేతులు కలిపానని మీరు ఏవిదంగా చెపుతున్నారు? చంద్రబాబు చెపితేనే నేను ఇవన్నీ చేస్తున్నంటున్నారే మరైతే ఆనాడు మీరు జైల్లో ఉన్నప్పుడూ చంద్రబాబు చెపితేనే మీ కోసం పాదయాత్ర చేశానా? ఆయన చెపితేనే ఓదార్పు యాత్రలు, సమైక్యాంద్ర యాత్రలు చేశానా? బైబై బాబు అనే క్యాంపెయిన్ కూడా ఆయన చెపితేనే నడిపానా?

చంద్రబాబు నాయుడు నన్ను, సునీతని, తెలంగాణ సిఎం రేవంత్‌ రెడ్డిని, చివరికి ప్రధాని నరేంద్రమోడీని కూడా కంట్రోల్ చేస్తున్నారన్నట్లు జగన్‌ రెడ్డి మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు తనకంటే చాలా శక్తివంతుడనట్లు ఆయనే చెప్పుకుంటూ, మళ్ళీ అందరినీ నిందిస్తున్నారు.

జగన్‌ రెడ్డి మానసిక స్థితిపై నాకు అనుమానంగా ఉంది. ఆయన చంద్రబాబు నాయుడుని చూసి భయపడుతూ ఎవరు ఏది మాట్లాడినా, ఏం జరిగినా అన్నిటికీ చంద్రబాబు నాయుడే కారణమన్నట్లు ఊహించుకుంటూ ఓ రకమైన భ్రాంతిలో ఉన్నారు. ఆ భ్రాంతితోనే ఇలా మాట్లాడుతున్నారు…అంటూ వైఎస్ షర్మిల ఓ అద్దం తీసి చూపిస్తూ ‘దీనిలో మీరు మొహం చూసుకుంటే మీకు మీ మొహం కనిపిస్తుందా లేదా చంద్రబాబు నాయుడు మొహమే కనిపిస్తుందా?” అంటూ వ్యంగ్యంగా జగనన్నని ప్రశ్నించారు.

యాదృచ్ఛికంగా చంద్రబాబు నాయుడు కూడా ఈరోజు ఇదే విషయం మాట్లాడుతూ, “ఇప్పుడు చెల్లి వైఎస్ షర్మిల నాతో చేతులు కలిపారాని ఆరోపిస్తున్నారు. రేపు మీ భార్య భారతితో మీకు ఏవైనా విభేధాలు వస్తే వాటికీ నేనే కారణం అని నిందిస్తారా? మీ కుటుంబ సమస్యలను పరిష్కరించుకోలేక నన్ను నిందించడం సిగ్గు చేటు. సొంత కుటుంబాన్నే చక్కదిద్దుకోలేని జగన్‌, ఇక రాష్ట్రాన్ని ఎలా చక్కదిద్దగలరు?” అని ప్రశ్నించారు.

ADVERTISEMENT
Latest Stories