YS Sharmilaవైఎస్ షర్మిల ఈరోజు హైదరాబాద్ లోని ఒక కార్యక్రమంలో పార్టీ అధికారిక వెబ్సైట్ లాంచ్ చేశారు. ఈ సమయంలో కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తూ తెలంగాణలో రానున్నది రాజన్న సంక్షేమ రాజ్యం అని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి పై… అలాగే రేవంత్ రెడ్డి ని పీసీసీ అధ్యక్షుడిని చెయ్యడం పై కీలక వ్యాఖ్యలు చేశారు.

“కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మనమంతా చూస్తూనే ఉన్నాం. దిక్కు తోచక ఆ పార్టీ తెలుగుదేశం నాయకుడు రేవంత్ రెడ్డిని తెచ్చుకుని పార్టీ అధ్యక్షుడిని చేసింది,” ఆమె వ్యంగ్యంగా చెప్పుకొచ్చారు. రేవంత్ రెడ్డి గతంలో టీడీపీ నాయకుడు అనేది అనుమానం లేకుండా చెప్పదగిన విషయమే…అయితే ఆమె చెప్పిన లాజిక్ ఆమెకు వర్తించదా?

తెలంగాణ లో ఎవరూ లేనట్టు అక్కడి ప్రజలకు దిక్కు తోచక ఆంధ్రప్రదేశ్ లో పుట్టిన షర్మిలకు ఓట్లు వేసుకుని గెలిపించి ముఖ్యమంత్రిని చెయ్యాలా? తెలుగుదేశం నుండి వచ్చిన రేవంత్ రెడ్డిని పార్టీ అధ్యక్షుడిని చెయ్యడం తప్పైతే ఇది కూడా తప్పే కదా? దానిని తిప్పికొట్టేందుకే కదా షర్మిల అష్టకష్టాలు పడుతున్నారు.

రాజకీయాలలో విమర్శలు చేసేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి ఒక్కోసారి మనం చేసే విమర్శలు మనకే తగిలే అవకాశం ఉంది. ఇది ఇలా ఉండగా.. లోట‌ల్‌పాండ్ లోని షర్మిల నివాసం వద్ద ఉద్రిక్త‌త‌ చోటు చేసుకుంది. ఈ సందర్భంగా రాయలసీమ పరిరక్షణ సమితి, అమ‌రావ‌తి ప‌రిర‌క్ష‌ణ స‌మితి స‌భ్యుల‌పై ష‌ర్మిల అనుచ‌రుల వీరంగం సృష్టించారు. స‌మితి స‌భ్యుడిని ష‌ర్మిల అనుచ‌రులు బూటుకాలుతో తన్నారు.