‘యాత్ర సినిమా’తో జగన్ కానీ, వైసీపీ కానీ ఎంత మైలేజ్ సాధించారో ఇప్పుడే చెప్పలేము కానీ కాంగ్రెస్ పార్టీ తరుపున వైస్ షర్మిల చేస్తున్న ‘ప్రచార యాత్ర’ మాత్రం వైసీపీ ప్రభుత్వానికి, ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్ కు పెద్ద డామేజే తెచ్చిపెట్టేలా ఉంది.
Also Read – వైసీపీలో స్టేట్, నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్.. తగ్గేదేలే!
3200 కిలోమీటర్లు పాదయాత్ర చేసి మొక్కగా ఉన్న వైసీపీ పార్టీని నేను దగ్గరుండి నీరు పోసి, ఎరువు పెట్టి పెంచి చెట్టుగా మార్చాను. చెట్టుగా మారింది కాబట్టి ఇక నా అవసరం లేదని మాట్లాడుతున్న ఈ వైసీపీ నాయకుల అహంకారాన్ని ప్రజలు గమనిస్తున్నారని దీనికి ఖచ్చితంగా సమాధానం చెప్పే రోజుకొకటి వస్తుందన్నారు షర్మిల.
అలాగే అక్కడి స్థానిక ఎమ్మెల్యే అయిన మంత్రి రోజా పై కూడా షర్మిల ‘జబర్దస్తు పంచులు’ పేల్చారు. నగరి నియోజకవర్గ ప్రజలకి ‘ఒక ఎమ్మెల్యే నలుగురు మంత్రులు ఉన్నారట’…,ఇక వారందరు కలిసి గ్రావెల్, చెరువులో ఉండే మట్టి, వెంచర్లు వేసే రియల్టర్ల నుండి ముడుపులు తీసుకుంటూ ఇలా తన నియోజకవర్గమంతా జబర్దస్తుగా దోచేసుకుంటూ మా పై విమర్శలకు దిగుతున్నారు అంటూ రోజా అక్రమ సంపాదనను, అవినీతి చిట్టాను బయటపెట్టారు.
Also Read – అరగంట క్రితం అవంతి రాజీనామా… జనసేనలోకేనా?
అక్కడి తో ఆగకుండా రోజా తో పాటు ఆమె భర్త, ఆమె ఇద్దరి సోదరులు కూడా మంత్రులుగా చెలామణి అయ్యి స్థానిక ప్రజల నుండి కమిషన్లు పిండుకుంటున్నారని వ్యాఖ్యానించారు. అలాగే గతంలో కాంగ్రెస్ పార్టీని తప్పుపట్టిన షర్మిల ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరడం పై విమర్శలు చేసిన రోజాకు కూడా గట్టి కౌంటర్ ఇచ్చారు షర్మిల. ”అమ్మా…రోజమ్మ నువ్వు నా గతం గురించి గుర్తుపెట్టుకుని నీ గతాన్ని మర్చిపోయినట్టున్నావు” అన్నట్టుగా రోజా గతాన్ని కూడా ఒక్కసారి తనతో పాటు, వైసీపీ పార్టీలోని ముఖ్యనేతలకు, వైస్సార్ అభిమానులకు, ఏపీ ప్రజలకు కూడా మరోసారి గుర్తుచేశారు.
మీరు టీడీపీ పార్టీలో ఐరన్ లెగ్ గా ముద్రపడిన సందర్భంలో టీడీపీ కండువా కప్పుకుని వైస్సార్ ను పంచ ఊడతీసి కొడతాను అంటూ చేసిన పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు మరిచిపోయావా తల్లి అంటూ రోజా నోటికి కళ్లెం వేసే ప్రయత్నం చేసారు. అలాగే పనిలోపనిగా రాజశేఖర్ రెడ్డి బిడ్డ కాబట్టి ఈ ప్రాంతం దాటి వెళ్లగలిగింది, కేవలం వైస్సార్ మీద ఉన్న అభిమానంతోనే షర్మిలను వెళ్ళనిచ్చాం అంటూ తనను ఉద్దేశించి వైసీపీ నాయకుడు చేసిన వ్యాఖ్యలకు ఈసభలో కౌంటర్ ఇచ్చారు షర్మిల.
Also Read – జమిలి బిల్లు సరే… ఆచరణ సాధ్యమేనా?
ఒక్క నిముషం నేను రాజశేఖర్ రెడ్డి బిడ్డ కాదనుకోండి..,ఎవరు వస్తారో? ఎంత మంది వస్తారో? ఏంచేస్తారో చేయండి? మీ దమ్మేంటో చూపించండి..రండి అంటూ వైసీపీ నాయకులకు సవాల్ విసిరారు. అలాగే సిగ్గుండాలి కదా, ఆడామగా తేడా లేదు, ఉచ్ఛం నీచం తేడాలేకుండా చెల్లెలు అనే ఇంగితం కూడా లేకుండా ఇటువంటి విమర్శలను ప్రోత్సాహిస్తారా..? అంటూ పరోక్షంగా జగన్ పై కూడా రెచ్చిపోయారు షర్మిల. దీనితో షర్మిల ప్రచార యాత్ర పూర్తయ్యేసరికి జగన్ ప్రచారానికి వాడుకున్న యాత్ర కనుమరుగవడం ఖాయంగా కనపడుతుంది.