Chandrababu Naidu YS-Sharmila-YS-Jagan

జగన్‌ ప్రభుత్వం హయాంలో తిరుమల ప్రసాదాలలో జంతువుల కొవ్వుతో కూడిన నూనెలు వాడి మహాపచారం చేశారని సిఎం చంద్రబాబు నాయుడు సంచలన ఆరోపణలు చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తిరుమల ప్రక్షాళన ప్రారంభించామని అన్నారు. ప్రసాదాలలో ఇదివరకులా నాణ్యమైన నెయ్యి, నూనె, దినుసులు వాడేందుకు అవసరమైన చర్యలు చేపట్టామని సిఎం చంద్రబాబు నాయుడు అన్నారు.

Also Read – హర్ష్ కుమార్‌కు వైసీపీ వైరస్ సోకిందా?

అయితే ఆయన ఆరోపణలను వైసీపి ఖండించింది. తిరుమల ప్రసాదం విషయంలో కుటుంబంతో సహా శ్రీవారి ముందు ప్రమాణానికి సిద్దమని టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి… గారు.. మరి మీ కుటుంబంతో శ్రీవారి ముందు ప్రమాణానికి సిద్దమా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌… అంటూ సవాలు విసిరింది.

టీటీడీ మాజీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్ రెడ్డి కూడా సిఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలను ఖండించారు. తిరుమల శ్రీవారి దయతోనే అలిపిరి దాడిలో ప్రాణాలతో బయటపడిన చంద్రబాబు నాయుడు తిరుమల శ్రీవారి ప్రసాదంపై రాజకీయాలు చేయడం సరికాదని వారు వాదించారు.

Also Read – ఒక్క హిట్ ప్లీజ్…

తిరుమల ప్రసాదం గురించి సిఎం చంద్రబాబు నాయుడు చేసిన ఈ వ్యాఖ్యలపై ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూడా ఘాటుగా స్పందించారు.

హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా టిడిపి, వైసీపి రెండు పార్టీలు నీచ రాజకీయాలు చేస్తున్నాయని, సిఎం హోదాలో చంద్రబాబు నాయుడు చేసిన ఈ వ్యాఖ్యలు తిరుమల పవిత్రత, ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉన్నాయి. కనుక మీకు ఎటువంటి రాజకీయ దురుదేశ్యం లేన్నట్లయితే తక్షణం నిజనిర్ధారణకి స్థాయి కమిటీ లేదా సీబీఐ చేత విచారణ జరిపించాలని ఏపీ కాంగ్రెస్‌ డిమాండ్ చేస్తోంది,” అంటూ ట్వీట్‌ చేశారు.

Also Read – రివ్యూల దీపం ఆర్పేస్తే, సినిమా అంధకారంలో మునిగిపోతుంది.

జగన్‌ హయాంలో తిరుమలతో సహా రాష్ట్రంలో ప్రసిద్ద ఆలయాలలో జరిగిన అపచారాలకు లెక్కే లేదు. ముఖ్యంగా టీటీడీ పేరుతో వైసీపి నేతలు తిరుమల ఆర్జిత సేవలను వ్యాపారంగా మార్చేశారు. రోజా తదితర మంత్రులు మంది మార్బలంతో నెలకు మూడు నాలుగుసార్లు తిరుమలపై దండెత్తుతుండేవారు.

కనుక జగన్‌ హయాంలోనే తిరుమల ప్రతిష్టకు చాలా భంగం కలిగింది. తిరుమల శ్రీవారితో ఆటలాడుకున్నందుకే వైస్ దుర్మరణం పాలయ్యారు. జగన్‌ ఎన్నికలలో ఓడిపోయారు… అని తెలిసిన తర్వాత సిఎం చంద్రబాబు నాయుడు అటువంటి సాహసం చేస్తారని అనుకోలేము. ఏ సాక్ష్యాధారాలు లేకుండా ఇటువంటి ఆరోపణలు చేస్తే ఏమవుతుందో కూడా సిఎం చంద్రబాబు నాయుడు తెలుసు. కనుక ఆయన నిరాధారమైన ఆరోపణలు చేస్తారనుకోలేము.




కనుక వైఎస్ షర్మిల డిమాండ్ చేసిన్నట్లు దీనిపై విచారణ జరిపిస్తే నిజానిజాలు బయటపడతాయి. లేకుంటే సున్నితమైన ఇటువంటి అంశంపై ఆరోపణలు చేసినందుకు వైసీపి వేలెత్తి చూపుతూనే ఉంటుంది. టిడిపి కూటమి ప్రభుత్వం విచారణ జరిపిస్తే వైఎస్ షర్మిల బాణం జగన్‌కే గురిపెట్టిన్నట్లవుతుంది.