ys-jagan-ys-sharmila-ktr-kavitha

వైసీపీ…బిఆర్ఎస్ రెండు పార్టీలు కూడా కొన్ని కొన్ని అంశాలలో అవిభక్త కవలలు మాదిరి కలవరపడుతున్నాయి. ఉదాహరణకు వైసీపీ కి వైస్ షర్మిల రూపంలో ఎదురుగాలి వీస్తే, బిఆర్ఎస్ కు కవిత రూపంలో గులాబీ ముళ్ళు గుచ్చుకుంది.

ఇక నాడు అన్న వైస్ జగన్ కు వ్యతిరేకంగా అడుగులు వేయడానికి, వైసీపీ ఫ్యాన్ గాలికి ఎదురొడ్డి పోరాడడానికి ముందు వైస్ షర్మిల వైసీపీ చిరకాల మీడియా ప్రత్యర్థి అయిన ABN కు, జగన్ ఆగర్భ శత్రువు అయిన రాధాకృష్ణకు ఇంటర్ వ్యూ ఇచ్చారు.

Also Read – నిర్మాణం ఎలాగూ చాతకాదు కనీసం..

దీనితో షర్మిల భవిష్యత్ రాజకీయ ప్రణాళికలు ఎలా ఉండబోతున్నాయి, తన ప్రధమ రాజకీయ ప్రత్యర్థి ఎవరు అనేది ఆమె చెప్పకనే చెప్పారు. ఇక ఇప్పుడు షర్మిల బాటలోనే కవిత కూడా తన రాజకీయ ప్రయాణాన్ని కొనసాగించబోతున్నారా.? అన్న సందేహాలు కలుగుతున్నాయి.

ఇందుకు కవిత ఒక టీవీ ఛానల్ కు ఇస్తున్న ఇంటర్ వ్యూ సాక్షిగా నిలుస్తుంది. నేడు బిఆర్ఎస్ రెబల్ ఎమ్మెల్సీ కవిత టీడీపీ ప్రత్యర్థుల ప్రతికూల మీడియా గా పేర్కొనబడే టీవీ 5 ను ఎంచుకోవడం అంటే అది బిఆర్ఎస్ ను గుచ్చడమే అవుతుంది, కేటీఆర్ ని వ్యతిరేకించడం కిందకే వస్తుంది.

Also Read – మంగళగిరి మొనగాడెవరు.?

అయితే కవిత ఇప్పటికే తన జాగృతి కార్యక్రమాలతో, తన రాజకీయ ప్రకటనలతో కేసీఆర్ సహనాన్ని పరీక్షిస్తుంది. ఇక ఇప్పుడు తమ ప్రత్యర్థి మీడియా కు వెళ్లి మరి స్పెషల్ ఇంటర్ వ్యూ ఇవ్వడం అంటే అది తనను తన పార్టీని కించపరచడం కిందకే వస్తుంది అనే భావన కేసీఆర్ కు, బిఆర్ఎస్ క్యాడర్ కు కలిగే ప్రమాదం ఉంది.

నాడు వైసీపీ కి వ్యతిరేకంగా షర్మిల వేసిన తొలి అడుగు ABN కాగా, నేడు కవిత టీవీ 5 లో వేస్తున్న అడుగు బిఆర్ఎస్ పతనానికి తొలిమెట్టు కానుందా.? ఈ సంకేతాలన్నీ కూడా వైసీపీ, బిఆర్ఎస్ పార్టీలకు రాహుకాలంగా సూచిస్తున్నాయా.? వైసీపీ మాదిరే త్వరలో బిఆర్ఎస్ కూడా ఇంటి ఆడపడుచు చేత విమర్శలు ఎదుర్కోనుందా.?

Also Read – హిందీ భాష పై బాబు స్పందన…


ఈ నేపథ్యంలో వైసీపీ కి షర్మిల మాదిరి బిఆర్ఎస్ కు కవిత గండం పొంచిఉన్నట్టుగా భావించాలా.? అయితే వైసీపీ పై రాజకీయ పగ తీర్చుకోవడానికి, అన్న జగన్ ను దెబ్బ కొట్టడానికి షర్మిలకు నాడు కాంగ్రెస్ అధిష్టానం ఆశీస్సులు లభించాయి. మరి కవిత ఆలోచనలకు, ఆశయాలకు నేడు ఏ పార్టీ మద్దతు దక్కనుందో.?