వైఎస్ వివేకా హత్య కేసులో కుటుంబం చాలానే సమాధానాలు చెప్పాలి

YS Vivekananda Reddy family to open up on murder వైఎస్ వివేకా హత్యకేసులో పోలీసులు నిన్న సాక్ష్యాధారాలను ధ్వంసం చేసి.. హత్య చేసిన వారు తప్పించుకొనేందుకు సహకరించిన ముగ్గురిని అరెస్టు చేశారు. పోలీసుల రిమాండ్ రిపోర్ట్ ప్రకారం…. వైఎస్‌ వివేకానందరెడ్డి మృతదేహంపై ఏడు చోట్ల పదునైన, లోతైన గాయాలున్నాయి. తలకైన తీవ్ర గాయాలు కనిపించకుండా బ్యాండేజీ వేశారు. వీటన్నింటినీ విశ్లేషించిన తర్వాత అత్యంత క్రూరంగా వివేకానుహింసించి…ప్రమాదకరమైన ఆయుధంతో ఆయన తలపై దాడి చేసి చంపినట్లు తేలింది,” అని వివరించారు.

ADVERTISEMENT

ఏడు చోట్ల పదునైన, లోతైన గాయాలు అయ్యి. లీటర్ల కొద్దీ రక్తం పారినప్పుడు కూడా ఆ రోజు మధ్యాహ్నం వైకాపా నాయకులు అందరూ దానిని గుండెపోటు అని ఎలా అనుకున్నారు అనేదాని మీద సమాధానం చెప్పాలి. స్వయంగా హత్యాస్థలంలో ఉన్న మాజీ ఎంపీ అవినాష్ రెడ్డి కూడా అదే మాట చెప్పడం విశేషం. సాక్షి టీవీ, విజయసాయి రెడ్డి కూడా అదే మాట అన్నారు. అదే సమయంలో పోలీసులు వివేకా పడకగది, స్నానపుగదిలోని రక్తపు మరకలను శుభ్రపరిచేందుకు వినియోగించిన ప్లాస్టిక్‌ బకెట్‌, తడిగుడ్డ, అక్కడున్న వెంట్రుకలు, బొట్టు స్టిక్కర్ల స్వాధీనం చేసుకున్నారు.

దీనిబట్టి సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నాలు జరిగిందనేది స్పష్టం. వైఎస్ కుటుంబం వైపు ఇవన్నీ వేలెత్తి చూపిస్తున్నాయి. ఈ సమయంలో వైకాపా వారు చంద్రబాబు, లోకేష్ నుండి బీటెక్ రవి, ఆదినారాయణరెడ్డి వరకూ విమర్శలు చెయ్యడం అర్ధరహితం. ముందు ఇంతటి కిరాతకంగా జరిగిన హత్యను గుండెపోటు అని ఎలా అనుకున్నారో సమాధానము చెప్పాల్సి ఉంది. ప్రజల దృష్టి మరచడానికి పదే పదే వివేకా కుమార్తెను మీడియా ముందుకు తీసుకుని రావడం. కోర్టులలో ఈ కేసును కేంద్రానికి పంపే ప్రయత్నం చెయ్యడం కూడా అనుమానాస్పదంగానే ఉంది.

ADVERTISEMENT
Latest Stories