YSRCP Analysis on pawan-kalyan Graph

ఎన్నికలకు ముందు వరకు జగన్‌తో సహా వైసీపీ నేతలందరూ వంతులు వేసుకున్నట్లు పవన్ కళ్యాణ్‌ని అవహేళన చేసేవారు. ఏదోవిదంగా ఆయనని రెచ్చగొట్టి చంద్రబాబు నాయుడు నుంచి దూరం చేయగలిగితే టీడీపీతో చెడుగుడు ఆడేసుకోవచ్చని అనుకున్నారు.

గమ్మత్తైన విషయం ఏమిటంటే, పవన్ కళ్యాణ్‌ చాతగానివాడు, రాజకీయాలలో ఓనమాలు తెలియని దద్దమ్మ అంటూ చులకనగా మాట్లాడిన వైసీపీ నేతలె ఆయన చంద్రబాబు నాయుడుతో చేతులు కలిపితే తమకు ప్రమాదమని భయపడ్డారు.

Also Read – ‘తమిళ’ దర్శకులు ‘తెలుగు’ వారిని మెప్పించలేరా..?

వారు భయపడిన్నట్లే పవన్ కళ్యాణ్‌ 100 శాతం స్ట్రైక్ రేటుతో పోటీ చేసిన అన్ని సీట్లు గెలుచుకున్నారు. ఉప ముఖ్యమంత్రి అయ్యారు కూడా.

ఎన్నికలకు ముందు టీడీపీ-జనసేనలని విడగొట్టే ప్రయత్నాలు విఫలమైనప్పటికీ, నేటికీ తమ కష్టాలన్నీటికీ అదొక్కటే పరిష్కారం అని జగన్‌ గట్టిగా నమ్ముతున్నారు. కనుక ఆవు కధలా రాష్ట్రంలో ఎప్పుడు ఏం జరిగినా దానిలో నుంచి ఓ పాయింట్ లాగి దాంతో పవన్ కళ్యాణ్‌ మరింత బలవంతుడుగా మారిపోతున్నారనో లేదా మరింత బలహీనంగా మారిపోతున్నారనో గట్టిగా వాదిస్తూ, కూటమి ప్రభుత్వంలో చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు.

Also Read – కౌశిక్ రెడ్డి…పార్టీ కోసమా..? పేరు కోసమా.?

బుధవారం విశాఖలో జరిగిన సభలో చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ని పక్కనపెట్టేసి, కేవలం మంత్రి అయిన నారా లోకేష్‌ని హైలైట్ చేసేందుకు ప్రయత్నించారని, ప్రధాని మోడీ కూడా పవన్ కళ్యాణ్‌ పట్టించుకోకుండా నారా లోకేష్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారని కనుక కూటమి ప్రభుత్వంలో, బీజేపి అధిష్టానం దృష్టిలో పవన్ కళ్యాణ్‌ గ్రాఫ్ పడిపోయిందని వైసీపీ నేతలు కనిపెట్టి చెప్పారు.

తిరుపతి ఘటనపై స్పందించిన రోజా తదితరులు పవన్ కళ్యాణ్‌ ప్రస్తావన తెచ్చి అర్దం పర్ధం లేని మాటలు మాట్లాడుతుండటం ఇందుకు మరో నిదర్శనం.

Also Read – మీడియా వారు జర భద్రం…!


చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌లను విడదీయడం ఎలాగూ సాధ్యం కాదు కనుక ఏదో విదంగా పవన్ కళ్యాణ్‌ని విడదీసి బయటకు రప్పించగలిగితే చాలు… కూటమి ప్రభుత్వం కూలిపోతుంది. ఈసారి మామూలు ఎన్నికలో లేదా జమిలి ఎన్నికలో వస్తే రాష్ట్రంలో మిగిలిన 60 శాతం ప్రజలు కూడా తనకే ఓట్లు వేసి ముఖ్యమంత్రి కుర్చీని అప్పగించేస్తారని జగన్‌ తాడేపల్లి ప్యాలస్‌లో పగటి కలలు కంటున్నారు. మనిషికి బ్రతకడానికి ఏదో ఓ ఆశ ఉండాలి. కనుక ఇది జగన్‌ ఆశ అని సరిపెట్టుకోవాలి.