రాజకీయాల్లో గెలుపు ఓటములు సర్వ సాధారణం. ఎన్టీఆర్ లాంటి మహా నాయకుడే ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. మెగాస్టార్ లాంటి మాస్ ఫాలోయింగ్ ఉన్న వ్యక్తే ప్రజా జీవితంగా లో సొంత ఊరలో ఘోరంగా ఓడిపోయాడు. మరి అలాంటి చేదు అనుభవాలు ఎన్నో చూసిన మనం…ఈరోజు తెలంగాణాలో వెలువడిన ఫలితాల విషయంలో గెలిచిన వారిని అభినందించాలి. ఓడిపోయిన వారిని ఓదార్చాలి తప్ప మరీ శృతి మించి మాట్లాడకూడదు. ఇదిలా ఉంటే గెలిచిన వారు సంబరాలు జరుపుకుంటున్నారు. ఓడి’పోయిన’ వారు ఇళ్లకే పరిమితం అయ్యారు. అయితే అటు కాకుండా, ఇటు కాకుండా..ఎటూ కాకుండా అసలు పోటీ చెయ్యని వాళ్ళు మాత్రం సోషియల్ మీడియాలో హంగామా చేస్తున్నారు.
[m9ad]
విషయం ఏంటి అంటే తెలంగాణాలో మహా కూటమి ఓటమి తెరాసా పార్టీ కన్నా…అటు జనసేన, ఇటు వైకాపా పార్టీలకు మంచి కిక్ ఇచ్చింది అనే చెప్పాలి. అయితే ఇక్కడ న్యాయమె గెలిచింది అని తెరాస సంబరపడుతుంటే, అన్యాయంగా గెలిచారు అంటూ కూటమి కుంటి సాకులు చెప్తుంది. ఇక వాళ్ళిద్దరి మధ్య అటు పవన్ అభిమానులు, ఇటు జగన్ అభిమానులు సోషియల్ మీడియా వేదికగా హడావిడి చేస్తున్నారు. కేసీఆర్ పై ప్రేమ కన్నా, కూటమిలో బాబు భాగస్వామి అవ్వడం వారి మింగుడు పడని విషయం కనుక, వీళ్ళకు వచ్చినట్లుగా బాబుపై, టీడీపీ పార్టీపై విమర్శలు చేస్తూ హల్‌చల్ చేస్తున్నారు. అయితే ఇక్కడ రాజకీయ విశ్లేషకులు మాత్రం, ఇదీ మరీ విడ్డూరంగా ఉంది, పోటీ చేసిన పార్టీలు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవడం సర్వ సాధారణమే కానీ, అసలు పోటీ చేసే క్రమంలో భయంతో పక్కకు తప్పుకుని ఇప్పుడేమో, కూటమి ఓటమిని ఆస్వాదిస్తూ కూటమిలో భాగస్వామి అయిన టీడీపీపై తమకున్న ద్వేషాన్ని పూర్తిగా చూపిస్తూ సోషియల్ మీడియాను ఆయుధంగా వాడుకుని పండగ చేసుకుంటున్నారు ఈ ఇరు పార్టీల వాళ్ళు ఇదే మరీ అతిగా ఉంది అంటున్నారు.
అయితే మొత్తంగా చూసుకుంటే కూటమి ఓడిపోవడం తెరాస కన్నా, ఈ ఇరు పార్టీలకు మంచి ఆనందాన్ని ఇస్తుంది అని స్పష్టంగా చెప్పవచ్చు. అయితే ఇప్పటికైతే పర్వాలేదు కానీ, 2019 ఎన్నికలు దగ్గర్లో ఉన్న క్రమంలో ఇదే ఊపు ఆంధ్రలో కొనసాగుతుందో, లేక చల్లబడి ఆ ఇరు పార్టీలు సర్దుకుంటాయో చూడాలి.



