kakinada-port-illegal-rice-import

కాకినాడ పోర్టు నుంచి గత 5 ఏళ్ళుగా రేషన్ బియ్యం విదేశాలకు అక్రమంగా రవాణా జరిగిందనే విషయం బయటపడితే, అందుకు మాజీ ముఖ్యమంత్రి జగన్‌, మాజీ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ ఆందోళన చెందుతూ ఉండాలి.

Also Read – ఆ రెండు పార్టీలకి గేమ్ చేంజర్‌ విశాఖపట్నమే!

కానీ ఇటువంటి సమస్యలలో చిక్కుకుంటే ఏవిదంగా రియాక్ట్ అవ్వాలో ముందే ఓ ఫార్ములా రూపొందించుకున్నారు. అదే ఎదురుదాడి, ప్రత్యారోపణలు, సొంత మీడియాలో పుంఖాను పుంఖాలుగా ఈ వ్యవహారంలో సిఎం చంద్రబాబు నాయుడే అవినీతికి పాల్పడ్డారని కధనాలు ప్రచురించడం.

కనుక ఇప్పుడూ అదే ఫార్ములాని ప్రయోగిస్తూ సొంత మీడియాలో కధనాలు మొదలయ్యాయి. వాటి సారాంశం ఏమిటంటే, కాకినాడ పోర్టు, సెజ్‌లో వాటాలు దక్కించుకోవడానికే చంద్రబాబు నాయుడు డైరెక్షన్‌లో పవన్ కళ్యాణ్‌, నాదెండ్ల మనోహర్ కలిసి పోర్టులో డ్రామా ఆది హైలైట్ చేశారు.

Also Read – జగన్‌ మార్క్ రాజకీయాలు ఇలాగే ఉంటాయి మరి!

తర్వాత చంద్రబాబు నాయుడుకి అత్యంత సన్నిహితుడైన పోర్టు యజమాని కేవీ రావు పోలీసులకు పిర్యాదు చేశారు. వెంటనే సీఐడీ రంగంలో దిగిపోయింది.

అరబిందో సంస్థ కడిగిన ముత్యం వంటిది. అది భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని కేవీ రావుతో ఒప్పందం చేసుకొని ఆయనకు రూ.494 కోట్లు చెల్లించి 41 శాతం వాటా కొనుగోలు చేసింది. ఆయనను బెదిరించి వాటాలు పొందాలనుకుంటే రూ.494 కోట్లు చెల్లించడం దేనికి?41 శాతం వాటాలు మాత్రమే తీసుకొని మిగిలినవి ఆయనకే ఎందుకు విడిచిపెడుతుంది? మొత్తం వాటాలు ఉచితంగా తీసుకోగలిగేది కదా?

Also Read – అక్కడ కవిత.. ఇక్కడ గుడివాడ సేమ్ టూ సేమ్!

అయినా 2020లో ఈ ఒప్పందం జరిగితే ఇప్పుడు ఆయన పోలీసులకు పిర్యాదు చేయడం దేనికి? ఒప్పందం నచ్చకపోయి ఉంటే వెంటనే అప్పుడే చేయవచ్చు కదా?నాలుగేళ్ళ క్రితం రెండు ప్రైవేట్ సంస్థల మద్య జరిగిన ఒప్పందంలో ఏమైనా వివాదాలు ఉన్నట్లయితే ఆ రెండు సంస్థలే తేల్చుకోవాలి కానీ మద్యలో ప్రభుత్వం ఎందుకు జోక్యం చేసుకుంటోంది?అంటూ పెద్ద కధనమే ప్రచురించింది.




అయితే కాకినాడ పోర్టు నుంచి గత 5 ఏళ్ళుగా రేషన్ బియ్యం అక్రమంగా రవాణా జరుగుతున్న విషయాన్ని చాలా చాకచక్యంగా పక్కన పెట్టేసింది!