మరో 25 మంది వైసీపీ ఎమ్మెల్యేలు లైన్లో ఉన్నారు!

YCP MLA Gottipati Ravikumarఏపీలో విపక్ష వైసీపీ తీవ్ర ఆందోళనలో కూరుకుపోయింది. తాజాగా అనంతపురం జిల్లా కదిరి ఎమ్మెల్యే చాంద్ బాషా చేరికతో 13 మంది ఎమ్మెల్యేలు వైసీపీకి చేయిచ్చి టీడీపీలో చేరిపోయారు. ఈ క్రమంలో టీడీపీ నేతలు మరో ప్రచారానికి తెరలేపారు. ఇప్పటివరకు చేరిన ఎమ్మెల్యేలకు తోడు మరో 25 మంది వైసీపీ ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరనున్నారని, వారితో తాము జరిపిన చర్చలు సత్ఫలితాలనిచ్చాయన్న ప్రచారంతో వైసీపీలో తీవ్ర ఆందోళన నెలకొంది.

ADVERTISEMENT

అయితే దీనికి మరింత బలం చేకూరే విధంగా ప్రకాశం జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ (అద్దంకి) కూడా సైకిలెక్కడం ఖరారైపోయింది. ఈ నెల 29న గొట్టిపాటి పార్టీ జెండా మార్చడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్లుగా సమాచారం. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో పార్టీలో చేరుతున్నట్లు గొట్టిపాటి వర్గీయులతో పాటు ఇటు టీడీపీ వర్గాలు కూడా చెబుతున్నాయి. దీంతో గొట్టిపాటిని బుజ్జగించేందుకు పార్టీ ఎవరిని పంపిస్తుందా అని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినా, జగన్ ను వీడుతున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతూ పోతోంది.

ADVERTISEMENT
Latest Stories